జగన్ ముక్కు సూటిగా ఉంటాడు. ఆ విషయంలో ఆయన ఎవరికీ వెరవరు. తాను భయపడరు, ఎవరైనా భయపడితే ఆయన అసలు ఊరుకోరు. చేతులు కట్టేసి కూర్చోవడం అంటే జగన్ కి ఇష్టంలేని పని. నిజంగా చెప్పాలంటే కరోనా వైరస్. దాన్ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ పేరిట 135 కోట్ల మంది జనాలని ఇంట్లో పెట్టి తాళం వేశారు.

 

దాని వల్ల కరోనా ఎంతో కొంత కట్టడి అయినా ఇపుడు తాళం ఎలా తీయాలో కూడా ఎవరికీ అర్ధం కావడంలేదు. మరో వైపు చూసుకుంటే ఇలా ఎంత ఉన్నా కూడా మరో వైపు కరోనా కేసులు వెల్లువలా పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు కరోనా విషయంలో జనాలకు అవగాహన కల్పించాల్సింది పోయి భయం ఎక్కువగా పెట్టేసారని అర్ధమవుతోంది.

 

దాంతో జనాలు అసలు కరోనా కేసులు ఉన్నా బయటకు చెప్పుకోవడంలేదు. దాని వల్ల కరోనా వ్యాప్తి అలా చాప కింద నీరులా పెరిగిపోతోంది. కరోనా వస్తే ధైర్యంగా ఆసుపత్రికి వెళ్లి చెక్ చేసుకోవాలని జనాలకు అవగాహన కల్పించాలి. అలాగే కరోనా రోగుల పట్ల వివక్ష ఉండరాదు. ఈ విషయాలే ప్రధానితో జగన్ చెప్పారు. వీడియో సమావేశం సందర్భంగా మోడీతో జగన్ మాట్లాడి ఇచ్చిన సూచనలు బాగున్నాయి. 

 

కరోనా విషయంలో అవగాహన కల్పించి భయం తొలగించకపోతే ఈ కేసులు ఇలాగే పెరిగిపోతాయి. జనం కూడా ఇంటి గడప దాటి రారు. రేపటి రోజున బతుకు బండి కూడా కదలదు అని జగన్ కుండబద్దలు కొట్టారు. నిజంగా కరోనా విషయంలో డీల్ చేయడం అందరికీ కొత్తే,   భారత్ లో కరోనా వచ్చిన కొత్తల్లో అయితే భయం పూర్తిగా పెట్టేశారు. దాదాపుగా చనిపోతారని అన్నారు. 

 

ఇపుడు మాత్రం అదే జనాలను మళ్ళీ సాధారణ స్థితికి తేలేకపోతున్నారు. నిజానికి కరోనా మహమ్మారి వీర విహారం చేస్తున్నా భారత్ లో మ‌రణాల రేటు తక్కువగాఉనే ఉంది. దీంతో దీని మీదనే జగన్ ఫోకస్ చేశారు. మరి ప్రధాని ఈ సూచనలు ఎలా తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: