లాక్ డౌన్ కారణంగా కఠిన చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే.  కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిమిషం నిమిషం ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుకున్నారు..అందుకే లాక్ డౌన్ ను కూడా మరింత కట్టుడిడ్డంగా ఏర్పాటు చేశారు.. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

 

 

 

 

ఇకపోతే పేద ప్రజలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. అందుకే ప్రజల ఆకలి చావులు కొంతవరకైనా తీరుతున్నాయి .... ఇక సినీ తారలు కూడా అదే అదనుగా ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్ళు కూడా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసింద... సోషల్ మీడియా లో రోజుకో విధంగా వీడియోలను పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు...

 

 

 

పరిస్థితి విషమించిన బాధితుడి రక్షించే క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌ సీనియర్‌ రెసిడెంట్ డాక్టర్ పెద్ద సాహసమే చేశారు. రోగిని కాపాడే క్రమంలో తన వ్యక్తిగత భద్రతను పక్కనబెట్టారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు వైద్యుడు పీపీఈ కిట్‌లను తీసేసి, వైద్యం చేయడంతో ఆయనను క్వారంటైన్‌కు పంపారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన డాక్టర్ జహీద్ అబ్దుల్ అహ్మద్.. ఎయిమ్స్ సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

 

 

 

 

రోగి పరిస్థితి విషమించడంతో ఆక్సిజన్ కోసం గొంతులో అమర్చిన గొట్టం పొరపాటున ఊడిపోయినట్లు గమనించారు. దాన్ని తిరిగి అమర్చేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే అంబులెన్స్‌ లోపల వెలుగు సరిగా లేకపోవడం సహా తన వ్యక్తిగత రక్షణ కవచాలు, కళ్లజోడు ధరించి ఉండటంతో సరిగా కనిపించలేదని మజీద్‌ చెప్పారు. ఆలస్యం చేస్తే రోగి చనిపోయే ప్రమాదం ఉన్నందున అతడిని రక్షించడానికి కళ్లద్దాలు, ముఖానికి ఉండే కవచాన్ని తొలగించి, ట్యూబ్‌ను అమర్చినట్లు తెలిపారు. కరోనా అతని నుంచి డైరెక్ట్ గా సోకే ప్రమాదం ఉన్న కూడా అతను లెక్క చేయకుండా అతనికి వైద్యం చేసి కాపాడాడు.. దీంతో ఇప్పుడు అందరి చేత జేజేలు కొట్టించుకున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: