ప్రపంచాన్ని గజగజ లాడి స్తుంది కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ భూమి మీద 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. రోజుకి కొన్ని లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. ఇదే సందర్భంలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే మరణాలు జరుగుతున్న తీరు చూస్తే చాలా మంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని ఓ రిపోర్టులో  తేలింది. అధిక బరువు కలిగిన వారిలోనే కొవిడ్-19 ముప్పు అత్యధికంగా ఉంటుందని పేర్కొంది. అమెరికా దేశానికి చెందిన రిపోర్టు ప్రకారం ప్రతి ఐదుగురిలో ఇద్దరిలో శ్వాస నాళాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపింది.

 

అలాగే ఫ్రాన్స్ దేశంలో కొనసాగుతున్న తక్కువ బరువు ఉన్న వారితో పోలిస్తే అధిక బరువు ఉన్న వారిలో దాదాపు 90 శాతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అవసరం తప్పక ఏర్పడిందని తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్ సోకిన ఒబిసిటీ బాధితులు ఎక్కువగా ఐసీయూలో చేరటానికి గల కారణం చూస్తే ఛాతిలో అధిక స్థాయిలో కొవ్వు, పొట్టపై బెల్లీ కొవ్వు కారణంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి పడటం. దీని కారణంగా అధిక స్థూలకాయం ఉన్నవారిలో శ్వాసపరమైన సమస్యలు ఎక్కువగా ఉండబోతున్నట్లు ఇటీవల పరిశోధనల్లో బయటపడ్డాయి.

 

కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో ఎక్కువ ప్రభావం చూపడంతో శ్వాసకు సంబంధించి సామర్థ్యాన్ని భయం తగ్గించే క్రమం లో అధిక బరువు ఉన్న వారిలో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండటంతో సదరు వ్యక్తి శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొని మరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ప్రతి ఒక్కరు అధిక బరువు లేకుండా ఉంటే చాలా వరకూ కరోనా వైరస్ ను చాలా ఈజీగా ఎదుర్కోవచ్చు అని వైద్యులు అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: