విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై టీడీపీ నేతలు రాజకీయం చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమే ఈ ఘటన అంటూ మండిపడుతున్నారు. అలాగే కోటి సాయం చేస్తే మనిషి ప్రాణాలు తీసుకొస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇంకా విషవాయువు అయిన పాలి స్టైరీన్ తయారు చేయడానికి అనుమతి ఇచ్చింది వైసీపీనే అంటూ ఆరోపణలు చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే టీడీపీ నేత బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ గ్యాస్ లీక్ ఘటనలో జగన్ ప్రభుత్వం ఆ కంపెనీ నుంచి రూ. 300 కోట్లు ముడుపులు తీసుకుందని, కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, కంపెనీని అక్కడ నుంచి తలరలించకుండా ఉండేందుకే డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు చేశారు.

 

ఇక బోండా చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు వస్తున్నాయి. అసలు ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ అక్కడికి వెళ్ళరాని, అలాగే ఏ మాత్రం ఆలోచించకుండా కోటి రూపాయలు సాయం ప్రకటించారని, ఇంకా మిగతా వాళ్లకు సాయం చేసారని ఇవేమీ టీడీపీ వాళ్లకు కనిపించడం లేదని విరుచుకుపడుతున్నారు.

 

అసలు ముడుపులు తీసుకునేటప్పుడు బోండా ఉమా ఏమన్నా దగ్గరుండి చూశారని ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు అనేవి అర్థవంతంగా ఉండాలని, అర్ధపర్ధం లేకుండా ఉండకూడదని బోండాకు కౌంటర్లు ఇస్తున్నారు. బాధితులని రెచ్చగొట్టి కంపెనీ దగ్గర ఆందోళనలు చేయిస్తుంది ఎవరో తెలుసని అంటున్నారు. ఇక ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు కూడా రివర్స్ లో కౌంటర్లు వేస్తున్నారు. బోండా చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని, ముడుపులు తీసుకున్నారు కాబట్టే, సీఎం ఆరోజు తాము, కంపెనీ వాళ్ళం కిందమీద పడతామలే అన్నట్లు మాట్లాడారని గుర్తుచేస్తున్నారు.

 

ఈ కంపెనీకి గత టీడీపీ ప్రభుత్వమే అనుమతులు ఇస్తే,  మరి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనే బోండా లాజికల్ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటున్నారు. ఒకవేళ 2018లొనే చంద్రబాబు అనుమతులు ఇస్తే, వాటిని రద్దు చేసి జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నారు. మొత్తానికైతే ఈ రెండు పార్టీల మధ్య విశాఖ గ్యాస్ లీకేజ్ మంటలు ఆగేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: