భారతదేశం అనేక మతాలు, కులాలు సంస్కృతి కలిగిన దేశం. ఎప్పటినుండో వివిధ నమ్మకాలు విశ్వాసాలు కలిగిన ప్రజలు ఒక చోట ఉన్నా గానీ ఎప్పుడూ కూడా కొట్టుకునేంత సంఘటనలు పెద్దగా చోటుచేసుకోలేదు. రాజకీయ పరంగా చూసుకుంటే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప పెద్దగా ఒకరి విశ్వాసాలు గురించి మరొకరు విమర్శించుకొన్నా అంత సీన్ దేశంలో మొన్నటి వరకు పెద్దగా లేదు. అయితే ఈ కరోనా వైరస్ రావటం తో కొంత మంది మెదడులో బుర్ర లేక ఉన్నట్లు ఏది పడితే అది వాగుతున్నారు. అలా వాగి అరెస్ట్ అవుతున్నారు. పైగా సోషల్ మీడియా రావటంతో ఎవరికి వారు మరీ రెచ్చిపోతున్నారు. ఏమాత్రం పసలేని వాదనలు లైవ్ వీడియోలో చేస్తూ రెచ్చగొడుతున్నారు.

 

కులం పరంగా, పార్టీపరంగా అదేవిధంగా మతాల పరంగా మనిషి భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇటీవల బెంగుళూరులో బేకరీ యజమాని ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం చేశారు. దీంతో అతనిపై కంప్లైంట్ రావడంతో వెంటనే పోలీసులు స్పందించి సదరు బేకరీ యజమాని పై కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఇంతకీ ఈయన వ్యవహరించిన వ్యవహారం ఏమిటంటే కరోనా వైరస్ విషయంలో ఎవరో చేసిన తప్పుని ముస్లింల మీద ఆపాదిస్తూ దాన్ని క్యాష్ చేసుకోవడానికి లాభం సంపాదించడానికి ఈ బేకరీ యజమాని వ్యవహరించారు.

 

తన బేకరీలో ముస్లిం ఉద్యోగులు లేరని.. తాము తయారు చేసే అన్ని ఉత్పత్తులు జైనులే తయారు చేస్తారంటూ ఒక ప్రకటనను సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది. వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ప్రకటనలు ఎవరూ చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: