ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి టైమింగ్ లో చంద్రబాబు పరిపాలన ఉన్న సమయంలో బషీర్ బాగ్ కాల్పుల సంఘటన చంద్రబాబు తలరాతను మార్చేసింది. చంద్రబాబు రాజకీయ కెరీర్లోనే అదొక మాయని మచ్చగా మిగిలిపోయింది. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ రోడ్డెక్కిన ఆందోళనకారుల మీద చంద్రబాబు సర్కార్ కాల్పులు జరపడంతో చంద్రబాబు పతనం స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారాన్ని జనం మీద వేయటానికి పంపిణీ సంస్థలు రెడీ అయ్యాయి. మార్చి మూడవ వారం నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్  అమలులో ఉండటంతో జనాలు చాలావరకు ఇళ్లకే పరిమితం కావడంతో చేతిలో డబ్బులు లేక చేయడానికి ఉద్యోగం లేక, పిల్లలను పోషించలేక, కుటుంబాన్ని నెట్టుకు రాలేక అనేక అవస్థలు పడ్డారు. చేయి చాచే పరిస్థితి ఏర్పడింది.

 

ఇటువంటి సమయంలో మార్చి మొదటి వారం నుండి తీసిన రీడింగ్ తో కంపెనీలు స్పాట్ బిల్లింగ్ పంపిణీ కూడా జరిగిపోయింది. మార్చి 24 తర్వాత లాక్ డౌన్ అమల్లోకి రావడంతో పంపిణీ సంస్థలు స్పాట్ బిల్లింగ్ నిలిపివేశాయి. ఏప్రిల్ నెలలోనే కరోనా భయంతో కరెంటు బిల్లు నిలిపి వేయగా తాజాగా మార్చి నెలలో కట్టేసిన బిల్లులను మళ్లీ చెల్లించాలని వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అసలే చేతిలో చిల్లిగవ్వ లేక అనేక ఇబ్బందులు పడుతున్న వారిని సైతం విద్యుత్ పంపిణీ సంస్థలు బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి.

 

రెండునెలల బిల్లులు చెల్లించాలి ఏపీ సర్కార్ తీసుకున్న దిక్కుమాలిన ఐడియా కి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి ఇంటి అద్దె కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని తెగ బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనం దగ్గర డబ్బు లేని టైంలో జగన్ సర్కారు ఈ విధంగా వ్యవహరించడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఖండిస్తున్నారు. ఈ విషయంలో ఏమాత్రం తేడా పడితే జగన్ సర్కార్ కి మాయని మచ్చగా పెరిగిన కరెంటు బిల్లులు వల్ల డామేజ్ ఏర్పడుతుందని అంటున్నారు. జగన్ సరిగ్గా ఈ విషయంలో డీల్ చేయలేకపోతే మొత్తం తలరాత మారిపోతుంది అని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: