40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఒకే రకమైన తప్పు పదేపదే చేస్తున్నారు. మరోసారి దేశ వ్యాప్తం గా ప్రజల అభిమానులను సంపాదించుకోలేక పోయినా కాంగ్రెస్ పార్టీతో జత కలిసే విధంగా తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి అర్థమవుతుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ టీడీపీ కలిసి ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకంగా ఉద్యమిస్తుంది. తెలంగాణ టిడిపి పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో కలిసి అడుగులు వేయటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి తెలంగాణలో పోటీ చేసింది.

 

మహా కూటమిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టిడిపి మరికొన్ని పార్టీలు కలసి పోటీ చేయగా ఓడిపోవడం జరిగింది. ఆ సమయములో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతో పాల్గొని చెట్టపట్టా లేసుకుని ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. అయినాగానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు పట్టం కట్టారు. ఈ సందర్భంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి కొన్నే సీట్లు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అసలు టిడిపితో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగిందన్న వాదన అప్పట్లో బలంగా వినపడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చంద్రబాబు.. మోడీ తో కలవటానికి అనేక తిప్పలు పడుతున్నారు.

 

ఇటువంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో టిడిపి కలవడాన్ని ఏపీ టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ పార్టీ లేవనెతు త్తు చంద్రబాబు అవకాశ రాజకీయ నాయకుడు అనటానికి ఇదొక నిదర్శనం అని అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తో...., పైన మోడీతో చేతులు కలపటానికి చంద్రబాబు అనేక దారులు వెతుకుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బిజెపి నాయకులు గమనిస్తున్నారని కీలక పాయింట్ లో చంద్రబాబు ని ఇరికించే విధంగా వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: