కరోనా నివారణ , లాక్ డౌన్ పై చర్చ లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఈరోజు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కొద్దీ సేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది.  6గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సూచనలు మోదీకి తెలియజేశారు. ప్రధానంగా అన్ని రాష్ట్రాలు మాత్రం రెండు డిమాండ్లును మోదీ కి వినిపించాయని సమాచారం. అవేంటంటే జోన్ల ఏర్పాటులో రాష్ట్రానికి స్వేచ్ఛ ఇవ్వాలని అలాగే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని అందుకు ప్రత్యేక  ప్యాకేజీలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.  
 
 మోదీ కూడా ముఖ్యమంత్రులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా కరోనా ను ఊళ్లకు విస్తరించనివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇప్పుడు ఇదే మనముందున్నఅతి పెద్ద సవాలు అని అన్నారు. కరోనా పై మనం విజయంసాధించామని యావత్ ప్రపంచం భావిస్తుందని, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు తగు నిర్ణయాలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు.    
 
ఇక లాక్ డౌన్ విషయానికి వస్తే  కేవలం బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలే లాక్ డౌన్ ను పొడిగించాలని కోరగా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం కేంద్రానికే వదిలేసేయని సమాచారం. ఒకవేళ పొడిగించినా మరిన్ని మినహాయింపులు ఉండేలా చూడాలనే ప్రతిపాదనను మోదీ ముందు ఉంచారు అలాగే విమానాలు , రైళ్ల రాకపోకలను మే 31 వరకు నిషేధిస్తే మంచిదని తమిళనాడు , తెలంగాణ ముఖ్యమంత్రులు కోరారు.  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యర్థనలను పరిగణలోకి  తీసుకొని ఈనెల 16లేదా 17న లాక్ డౌన్ పై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశాలు వున్నాయి. ఇదిలావుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య 68000కు చేరగా అందులో 2000కుపైగా మరణాలు సంభవించాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: