లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఓ బాలుడి అంతిమ యాత్ర హృదయవిదారకంగా సాగింది. తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా భద్రాచలం శివారులోని సుందరయ్యనగర్‌ కాలనీకి చెందిన ఫరీదా, ముర్తుజావలి దంపతులకు ఇద్దరు కుమారులు. ప‌దేళ్ల క్రిత‌మే అనారోగ్యంతో భర్త చనిపోవడంతో ఫరీదా కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే కొంత‌కాలంగా రెండో కుమారుడు సాదిక్‌ (13) ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. ఈక్ర‌మంలోనే ఆదివారం ఇంటి వద్ద చనిపోయాడు. అయితే బాలుడి ప్రాణం పోయినా ప‌క్కిటోళ్ల నుంచి క‌నీసం ప‌ల‌క‌రింపులు కూడా క‌రువ‌య్యాయి.


వీధి ప్ర‌జ‌లు కూడా త‌మ‌కేమీ ప‌ట్ట‌న్న‌ట్లుగా ఉన్నారు.. దీంతో రోజంతా ఎదురు చూసినా  క‌నీసం పాడే క‌ట్ట‌డానికి కూడా న‌లుగురు జ‌మ కాలేదు. ఏడ్చి ఏడ్చి ఆ త‌ల్లి కంటిలో నీరు ఇంకిపోయింది.. ఆ తాతకు మాన‌వ‌త్వం విలువ‌... మ‌నిషిత‌త్వం బోధ‌ప‌డింది. జ‌నార‌ణ్యంలో ఒంట‌రివాళ్ల‌మ‌ని తెలుసుకున్నాడు..ఉపాధినిచ్చిన తోపుడు బండినే చివ‌రికి మ‌న‌వ‌డికి పాడెగా మార్చాడు... బాలుడి మృత‌దేహాన్ని గోదావ‌రి తీరానికి తీసుకెళ్లి ఖ‌న‌నం చేశాడు.  పేదరికం కారణంగా మృతదేహాన్ని వాహనంలో తరలించే పరిస్థితి లేకపోవడంతో సాదిక్‌ తాత వీరన్నకు చెందిన పాత రిక్షాలో మృతదేహాన్ని తరలించారు.


 వీరన్న రిక్షా లాగుతుండగా సాదిక్‌ సోదరుడు, పెద్దమ్మతో పాటు కొద్దిమంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.గుండెల్ని పిండేసే, మాన‌వ‌త‌ను ప్ర‌శ్నించే ఈ సంఘ‌ట‌నపై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా చేతిలో చిల్లిగ‌వ్వ లేక‌పోవడంతో దారుణ‌మైన స్థితిలో కొడుకు అంతిమ సంస్క‌రాలు ఇలా నిర్వ‌హించాల్సి వ‌చ్చింద‌ని, క‌నీసం బంధువులు కూడా ద‌గ్గ‌ర‌కి రాలేద‌ని బాలుడి త‌ల్లి క‌న్నీరు మున్నీరైంది.  బాలుడి తాత వీరన్న, త‌ల్లి ఫ‌రీదా, పెద్ద‌నాన్న కూతురు నిర్మ‌లా ముగ్గురు  మాత్ర‌మే బాలుడి ద‌హ‌న సంస్క‌రాల‌కు ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.  బాలుడితో పాటు భ‌ద్రాచ‌లంలో మాన‌వ‌త్వమూ చ‌చ్చిపోయిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: