కరోనా  వైరస్ నియంత్రణలో  పోలీసులు ఎంతో సమర్ధవంతం గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎక్కువ మొత్తంలో ఇంటికే పరిమితం కావాలని కేవలం అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలి అంటూ సూచిస్తున్నారు. లాక్ డౌన్  సడలింపులు కొనసాగుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఈ మహమ్మారి బారినుంచి తప్పించుకోని  ప్రాణాలతో బయటపడగలుగుతారు అంటూ చెబుతున్నారు. ఇలా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. 

 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం లాక్ డౌన్ లో  భాగంగా పలు చోట్ల ప్రజల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు రోడ్డు నిబంధనలు అతిక్రమించినప్పటికీ చూసిచూడనట్లు వ్యవహరించిన పోలీస్ అధికారులు ప్రస్తుతం మాత్రం రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకపోతే... వారికి తగిన జరిమానాతో పాటు శిక్షలు కూడా విధిస్తున్నారు.  మొన్నటి వరకు కేవలం మాస్కులతో మాత్రమే కనిపించిన వాహనదారులు ఇప్పుడు మాస్కులతో పాటు హెల్మెట్ తో కూడా కనిపిస్తున్నారు. 

 

 

 తాజాగా ఇక్కడ ఒక వ్యక్తి హెల్మెట్ తో కనిపించాడు. కానీ అతన్ని చూసి ఏకంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్ షాక్ అవ్వాల్సిన  పరిస్థితి ఏర్పడింది. అదేంటి  హెల్మెట్ పెట్టుకుంటే మంచిది కదా... దానికి షాక్ అవ్వడం ఎందుకు అంటారా... అయితే ఆ వాహనదారులు పెట్టుకుంది మామూలు హెల్మెట్ కాదు క్రికెట్ ఆటలో ఆటగాళ్లు వాడే హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతూ రోడ్డెక్కాడు. ఈ ఘటన  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రికెట్ ఆడే హెల్మెట్ పెట్టుకుని వాహనం నడుపుతూ రోడ్డెక్కిన వాహనదారున్ని  ప్రశ్నించగా... ఇది కూడా హెల్మెటే కదా సార్  అంటూ పోలీసులకు బదులిచ్చాడు సదరు వాహనదారుడు. అయితే ఇలాంటి హెల్మెట్లు వాడకూడదని.. ప్రత్యేకంగా వాహనదారుల కోసం సూచించిన హెల్మెట్ వాడడం ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెప్పి  పంపిణీ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: