ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయితే ఈ మహమ్మారి వైరస్ ఎంతోమందికి సోకుతూ మరెంతో మంది  ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ కేవలం మనుషుల ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు... చనిపోయిన వారికి కూడా సరైన అంత్యక్రియలకు నోచుకోలేని పరిస్థితిని తీసుకొచ్చింది . కనీసం చనిపోయాక కూడా అంత్యక్రియలు చేద్దామంటే కరోనా వైరస్ నిబంధనల కారణంగా చేయలేని పరిస్థితి. ఒకవేళ కరోనా తో మరణిస్తే అయితే పరిస్థితి మరింత దారుణం. 

 

 

 కనీసం కడ చూపుకు  కూడా నోచుకోని పరిస్థితి. ఎ mలాంటి ఆచారాలు ఉండవు సాంప్రదాయాలు ఉండవు... అధికారులే అన్ని కానిచ్చేస్తారు. ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో అలాంటి దుస్థితి నెలకొంది. ఇక అంతే కాకుండా ఒకవేళ ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించినప్పుడు.. కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు అమలు లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం అంత్యక్రియలకు కొంతమంది మాత్రమే హాజరు కావాలని చెప్పింది. అయితే కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధించినప్పటికీ అటు మానవీయ కోణంలో ఆలోచిస్తే మాత్రం కుటుంబ సభ్యులకు ఇది ఒక బాధాకరమైన విషయమే అని చెప్పాలి. 

 

 

 తాజాగా ఇలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భర్త చనిపోవడంతో సదరు వృద్ధురాలు కన్నీటి పర్యంతం అవుతూనే ఎంతో ఓపిక తెచ్చుకుని భర్త కడ  చూపుకోసం వెళుతుంది. ఇది  గమనించిన చుట్టుపక్కల స్థానిక మహిళలు హృదయం చలించిపోయింది. దీంతో అందరూ ఆమె వెంటే బయలుదేరారు. ఇరుగు పొరుగున ఉండే మహిళలతోపాటు బంధువులను కూడా ఆమెను చివరి చూపుకు తీసుకెళ్తూ ఉన్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన శ్రీనగర్ కాలనీ లో జరిగింది. కరోనా  వైరస్ భయం ఉండడంతో మహిళలంతా అంత్యక్రియలకు కూడా మాస్కులతో తరలివెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: