రెండు రోజులకి ముందు వరకూ రోజూ సింగిల్ డిజిట్లకే కేసులు పరిమితం కాగా రాష్ట్ర ప్రభుత్వం తెగ సంబరపడిపోయింది. అయితే అనూహ్యంగా గతం రెండు రోజుల్లో.. రోజుకి ముప్పైకి పైగా కేసు నమోదు కాగా, సోమవారం ఏకంగా 79 కేసులు నమోదైయ్యాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు

 

తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1275కి చేరింది. అయితే.. గడిచిన 24 గంటల్లో 50 మంది డిశ్చాజ్ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు..

 

ఇందులో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…. నిన్న నమోదైన కేసులు అన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం. ఇక పోతే వాటిల్లో జియాగూడ ప్రాంతం నుంచి 25 ఉన్నట్లు తెలుస్తోంది. జియాగూడ పరిధిలోని దుర్గానగర్‌‌లో ఇటీవల వ్యక్తికి కరోనా సోకింది. వ్యక్తి కుటుంబంలోని ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది

 

అలాగే జియాగూడ పరిధిలో మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది. కరోనా బాధితుల బంధువులు, కరోనా లక్షణాలతో ఉన్న పలువురిని ఆస్పత్రులకు తరలించారు. వారి నమూనాలను పరీక్షలకు పంపించారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని హై అలెర్ట్ గా ప్రకటించిన అధికారులు ప్రజలను అసలు బయటకు రావద్దని సూచించారు.

 

రాష్ట్రంలో ప్రస్తుతం 444 యాక్టివ్ కేసులు ఉన్నట్లు హెల్త్ బులిటిన్‌లో పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 801 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 30 మంది మరణించారు. 

 

ఇక పోతే…. గత 14 రోజుల నుంచి కరీంనగర్, సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణ్ పేట్, వరంగల్ అర్బన్, జనగామ, గద్వాల, నిర్మల్‌ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: