తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. సోమవారం కొత్తగా 79 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనికి సంంధించిన హెల్త్ బులిటెన్ ను వైద్య అరోగ్య శాఖ వెల్లడిచింది. అయితే మొత్తం కేసులు ఒక్క ghmc పరిధిలోనీవే కావడం విశేషం.

 

ఇక కరోనా బారి నుండి తప్పించుకున్న వారి సంఖ్య 50 కాగా వారంతా డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1275కి చేరింది. ఇక రాష్ట్రంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మే 29 వరకు లాక్ డౌన్ ని కొనసాగించిన సంగతి తెలిసిందే

 

నిన్న గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారిలో హైదరాబాద్ నుంచి 42, సూర్యాపేట 4, నిర్మల్, అసిఫాబాద్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

 

హైదరాబాద్ పరిధిలో ఒక్క రోజే 79 కరోనా కేసులు నమోదవడంతో నగర వాసుల్లో ఆందోళన నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

అయితే తాజా పరిణామంతో కెసిఆర్ గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన సంఖ్యలో చేయట్లేదని అటు ఆరోగ్య శాఖ నిపుణులు నుండి, మీడియా నుండి మరియు ప్రజల నుండి అనేక విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ నిన్న ఒక్కసారిగా టెస్టులు సంఖ్య పెంచడం కేసులు వెల్లువలా నమోదు కావడం.... ఇప్పుడు అతనికి మింగుడుపడడం లేదు.

 

అదే కాకుండా అన్నీ జిహెచ్ఎంసి పరిధిలోనే కావడం అతనిపై మరింత ఒత్తిడి పెంచే అంశం. హైదరాబాద్ కి ఎంతో మంది విదేశీయులు మరియు విదేశీయులతో కాంటాక్ట్ అయిన వారు వస్తూ ఉంటారు. ఎంతో పక్కా ప్రణాళికతో హైదరాబాద్ లోని కొన్ని వేల నిర్థారణ టెస్టులు నిర్వహించాల్సింది పోయి ప్రతిరోజు రాష్ట్రం మొత్తం మీద 150 నుండి 200 టెస్టులు నిర్వహించిన కేసీఆర్ రకంగా వైఫల్యం చెందాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

 

ప్రెస్ మీట్ లలో అసలు ఎవరైనా టెస్టుల మాట ఎత్తితే తిట్ల దండకం మొదలుపెట్టిన కేసీఆర్ అవసరమైన మేరకే టెస్టుల నిర్వహిస్తున్నాం అని.. మీరెవరు మాకు సలహాలు ఇచ్చేదానికి అన్నట్లు మాట్లాడిన తీరు ఇప్పుడు రాష్ట్రంక్లో చర్చనీయాంశంగా మారింది. 

 

రానున్న రోజుల్లో టెస్టుల సంఖ్య పెరిగే కొద్దీ బయటపడే కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక పోతే అదే జరిగితే అందుకు బాధ్యత కేసీఆరే వహించాల్సి ఉంటుంది అంటున్నారు. అయినా ఒకే రోజులో ఒకే ఊర్లో 79 కేసులు అంటే మామూలు విషయం కాదు.. సంఖ్య ఇప్పటి తో ఆగేది లేదు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: