దేశంలో ఓ వైపను కరోనా మహమ్మారి విజృంభిస్తుందని భయంతో లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ లాక్ డౌన్ చేయడం వల్ల ఎన్నో అనార్థాలు కూడా జరుగుతున్నాయి.  కరోనాని కట్టడి చేయడం సంగతి పక్కన బెడితే మొన్నటి వరకు మద్యం లేక మందుబాబులు పిచ్చోళ్లయ్యారు.. ఉన్మాదులుగా మారారు. ఇప్పుడు మద్యం షాపులు తెరిచిన తర్వాత అడ్డగోలు మద్యం సేవిం ఆగం చేస్తున్నారు. ఇక నేరాల సంఖ్య మొన్నటి వరకు తక్కువే ఉన్నా ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయని అంటున్నారు.  తాాజాగా తన ప్రియురాలి కోరిక మేరకు ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు, దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిన్న పాళయంకు చెందిన గౌతమ్ అనే యువకుడు, సూరస్వర పట్టి గ్రామానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి ప్రేమించుకున్నారు.

 

ఇక లాక్ డౌన్ కారణంతో తన ప్రియురాలిని చూడలేకపోతున్నానని తెగ బాధపడేవాడు గౌతమ్.  ఈ నేపథ్యంలో ప్రియుడి బాధ చూడలేక  ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి, అతనికి వర్తమానం పంపింది. ఆ వెంటనే అతను ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇద్దరూ గదిలో ఉండగా, అమ్మాయి తల్లి ఇంటికి వచ్చి, లోపలి నుంచి మాటలు వినిపించడంతో, వెంటనే భర్త, కుమారుడు, తమ్ముడిని పిలిపించింది. ముగ్గురు కలిసి బ్యాట్ తో గౌతమ్ పై మూకుమ్మడి దాడిచేశారు. 

 

తీవ్ర గాయాలపాలైన అతను చనిపోతాడన్న భయంతో పోలీసులను పిలిపించారు. అయితే గౌతమ్ తమ ఇంట్లో దొంగగా వచ్చాడని.. తమను ఏమైనా చేస్తారన్న భయంతో కొట్టామని పోలీసులకు చెప్పారు.  కానీ అప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ మరణించాడు. దాంతో ఆ యువతిని గట్టిగా తమదైన పద్దతిలో ప్రశ్నించగా వాస్తవం చెప్పింది.  దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక తండ్రి, సోదరుడు, మేనమామను అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: