ప్రపంచంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.  కరోనా మాయాదారి వైరస్ ని కట్టడి చేయడానికి వివిధ దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మనుషుల మద్య దూరాలు పెరిగిపోయాయి.  మనిషి మనిషి తాకాలంటే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.  ఇక కరోనా ఇక్కడ అక్కడ ఎక్కడ బడితే అక్కడ అన్నట్లు డబ్బు పై కూడా ప్రభావం చూపిస్తుంది.  కొన్ని చోట్ల డబ్బులు వెదజల్లుతున్నా ఒక్కరు వాటి జోలికి పోవడం లేదు.  ఇటీవల ఓ ఆటోడ్రైవర్ తన డబ్బు పోగొట్టుకుంటే.. దాన్ని పోలీసలు స్వాదీనం చేసుకున్నారే తప్ప ఎవరూ ముట్టుకోలేదు.  మొత్తాని తన డబ్బు తాను సెఫ్టీగా తెచ్చుకున్నాడు. కొన్ని గ్రామాల్లో డబ్బులు వెదజల్లినా దానికి కరోనా ఉందన్న భయంతో ఆ డబ్బు తాకడం లేదు.. దాన్ని పోలీసులు శానిటైజేషన్ చేసి మరి స్వాదీనం చేసుకునే పరిస్థితి నెలకొంటుంది.  

 

తాజాగా చేపల కోసం చెరువులో వల వేస్తే అప్పుడప్పుడు వింత వింత వస్తువులు బయటకు రావడం సహజం. కానీ ఓ బాలుడికి మాత్రం ఏకంగా నోట్ల కట్ట దొరికింది. అన్ని రూ. 500,రూ. 2000 నోట్లు ఉండటం చూసి బాలుడు ఆశ్చర్యపోయాడు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో జనాలు ఆ చెరువ వద్దకు ఎగబడ్డారు.   మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో చోటు చేసుకుంది.  అరుద్ గ్రామానికి చెందిన ఓ బాలుడు చేపల కోసం వెళ్లాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఏ విసిరేసి వెళ్లిపోయాడు. కొంత సేపటికి ఆ బాలుడి వలకు ఈ నోట్ల కట్ట చిక్కింది.

 

వాటిని బయటకు తీయగా బలమైన గాలి రావడంతో చెల్లాచెదురుగా పడిపోయాయి.  . పోలీసులు వచ్చి నోట్లను  స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎందుకు అలా నీళ్లలో విసిరి వెళ్లాడనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి వాటిని అలా వేసి ఉంటారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి చేయడం వల్ల ఎన్ని విచిత్రాలు జరుగుతున్నాయో అంటున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: