వైసీపీ పార్టీలో వైయస్ జగన్ తర్వాత ఎక్కువగా వినపడే పేరు సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. దాదాపు జగన్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నాటినుండి తండ్రి చనిపోయిన తర్వాత జగన్ కి ఆలోచన చెబుతూ మరో పక్క భుజం కాస్తూ వచ్చాడు విజయసాయిరెడ్డి. 2014 ఎన్నికల తర్వాత జగన్ ప్రతిపక్షంలో కి వెళ్ళాక రాజకీయంగా జగన్ ముందుండి అన్ని చక్కగా చెకబేడుతుంటే మరోపక్క విజయసాయిరెడ్డి వెనక నుండి కథ మొత్తం నడిపించేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. చాలా వరకు జగన్ మరియు విజయసాయి రెడ్డి చర్చలు జరిపిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ణయాలు అమలు అవుతాయని ప్రత్యర్థులు అంటున్నారు.

 

అంతేకాకుండా జగన్ రిమోట్ మొత్తం విజయసాయి రెడ్డి దగ్గర ఉందని కూడా కామెంట్ చేస్తుంటారు. అటువంటిది జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర కు సంబంధించి వ్యవహారాలన్నీ చూసుకోవాలని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ క్రమంలో విశాఖపట్టణం లో ఉన్న వైసిపి నాయకులకు మరియు విజయసాయి రెడ్డికి మధ్య అనేక వివాదాలు తలెత్తినట్లు మొన్నటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ ఘటన జరిగిన సమయంలో జగన్ క్యాంప్ ఆఫీస్ నుండి బయలుదేరుతున్న సమయంలో తన కాన్వాయ్ నుండి విజయసాయిరెడ్డి నీ ఒక్కసారిగా దింపడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

జగన్ మరియు విజయసాయిరెడ్డి మధ్య ఏదో వార్ జరుగుతున్నట్లు  వార్తలు వచ్చాయి. కావాలని వైయస్ జగన్ విజయసాయి రెడ్డి ని దూరం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ఇటువంటి సమయంలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ విజయసాయిరెడ్డిని గ్యాస్ లీక్ ముంపు ప్రాంతాలలో జగన్ పడుకోబెట్టడం తో చెక్ పెట్టినట్లు అయింది. ఇద్దరి మధ్య ఏదో విధంగా గొడవలు పెట్టాలని వార్తలు ప్రచారం చేసిన ప్రత్యర్థులకు దిమ్మతిరిగి పోయినట్లు అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: