నీతులు చెప్పే వాడు ఎవడూ వాటిని పాటించరు అనే మాటలు అక్షరాల నిజం చేస్తున్నారు ఏపీ బీజేపీ నాయకులు. తరచుగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ విమర్శలు చేసేందుకు పోటీ పడుతున్న బిజెపి నాయకులు ప్రజా సమస్యల విషయంలో మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన నాయకులు తమ స్థాయిని మరింత గా తగ్గించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కరోనా టెస్టింగ్ కిట్లు కొనుగోలులో అక్రమాలు జరిగాయని దీనిపై వైసిపి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో విమర్శలు చేశారు. దీనిపై పెద్ద రాద్ధాంతం జరిగింది. ఇలా ఒకదాని వెంట ఒకటి ఏదో ఒక విషయం పై విమర్శలు చేసేందుకే నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను తీర్చే విధంగా ఏ ఒక్క నాయకుడు  ప్రయత్నిస్తున్నట్లుగా బిజెపిలో కనిపించడం లేదు.

 
 
 ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అదే సమయంలో జాతీయ పార్టీగా ఉన్న బిజెపి ఇంతకంటే ఎక్కువగా రాష్ట్రంలో సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్లాలి. అలా కాకుండా కేవలం ఆరోపణలు చేయడమే తమ పని అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. దీనిపై బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఏపీ ప్రజలు నిజంగా ఇబ్బందులకు గురి అయితే, కేంద్ర అధిష్టానానికి ఏపీ బీజేపీ నేతలు లేఖలు రాసి ఏపీ సమస్యలు తీర్చే విధంగా ప్రయత్నించవచ్చు. 
 
 
 
కానీ ఆ విధంగా చేసేందుకు, ప్రయత్నించేందుకు ఏ ఒక్కరూ ముందుకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ప్రస్తుతం బిజెపి లో ఉంటున్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి వారు ఉన్నా ఏపీ ప్రయోజనాల కోసం అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు ముందుకు రావడం లేదు. కనీసం ఏపీ సమస్యల గురించి పట్టించుకునే వారు ఎవరూ కనిపించడం లేదు. పోనీ రాష్ట్రం మొత్తానికి కాకపోయినా, తమ సొంత జిల్లాలకు కూడా సహాయం చేయించుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: