చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్ చూస్తుండ‌గానే ప్ర‌పంచాన్ని చుట్టేసింది. ఈ వైర‌స్ ఎంత ప్ర‌మాద‌కారో ప్ర‌పంచ దేశాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. ఈ వైర‌స్ మ‌నిషి నుంచి మ‌నిషికి సోక‌ద‌ని చెప్పుకుంటూ వ‌చ్చింది. కానీ.. చైనా మోస‌పూరిత వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌నే ఉన్న తైవాన్ దేశం ప‌సిగ‌ట్టింది. చైనాలో న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్ నెల‌లోనై వైర‌స్ ప్ర‌బ‌లుతున్న‌ట్లు గుర్తించి, వెంట‌నే అప్ర‌మ‌త్తం అయింది. అంతేగాకుండా.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థకు కూడా ఈ వైర‌స్ గురించి మెయిల్ చేసిన‌ట్లుగా ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. అయినా.. అటు చైనాగానీ.. ఇటు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌గానీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయినా త‌న‌ను తాను కాపాడుకునేందుకు, ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌ల‌ను వెంట‌నే తీసుకుంద‌ని, డిసెంబ‌ర్ 31 నుంచే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేప‌ట్టింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

 

అలాగే.. చైనా నుంచి వ‌చ్చే వారిని వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లిస్తూ దాదాపుగా రాక‌పోక‌ల‌ను నిలిపివేసింద‌ని అంటున్నారు. వైద్య‌సిబ్బందికి అవ‌స‌ర‌మైన పీపీఈ కిట్లు, ఇత‌ర ర‌క్ష‌ణ సామగ్రిని స‌మ‌కూర్చుకుంద‌ని చెబుతున్నారు. డిసెంబ‌ర్ 31 నుంచే ప‌రీక్ష‌లు చేయ‌గా.. కేవ‌లం ఇప్ప‌టివ‌ర‌కు 66,460 ప‌రీక్ష‌లు చేయ‌గా.. కేవ‌లం 440మందికి మాత్ర‌మే వైర‌స్ సోకింది. ఇందులో కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే మ‌ర‌ణించారు. జ‌న‌వ‌రి చివ‌రినాటికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ క‌రోనా వైర‌స్ గురించి ప్ర‌పంచాన్ని హెచ్చ‌రించేకంటే ముందుగానే.. తైవాన్ దాదాపుగా అన్ని ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంది. నేడు కేవ‌లం చైనా మోస‌పూరితత‌నం, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిర్ల‌క్ష్యం వ‌ల్లే నేడు ప్ర‌పంచం విల‌విలాడుతోంద‌ని తైవాన్ ఆరోపిస్తోంది. నిజానికి.. ముందునుంచీ కూడా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీనిని చైనీస్ వైర‌స్ అంటూ ఆరోపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏకంగా అంత‌ర్జాతీయ సంస్థ‌తో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఆస్ట్రేలియా త‌దిత‌ర దేశాలు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: