భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంకయ్య నాయుడు తెలుగురాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, ఉధృతిని గురించి ఆరా తీస్తున్నారు. సోమ‌వారం వ‌రంగ‌ల్ ఎంపీ ద‌యాక‌ర్‌కు ఫోన్ చేసిన ఉపారాష్ట్ర‌ప‌తి తాజాగా మంగ‌ళ‌వారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డికి  ఫోన్ చేసి మాట్లాడ‌టం విశేషం. కరోనా మహమ్మారి ప్ర‌బ‌లుతున్న వేళ జిల్లాలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఆయ‌న ఎంపీతో మాట్లాడారు.  విపత్కర ఈ పరిస్థితుల్లో  జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలో ఉంద‌ని ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి ఉప‌రాష్ట్ర‌ప‌తికి తెలిపారు. 

 

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంద‌ని వెంక‌య్య‌నాయుడుకు ఎంపీ వివ‌రించారు. సొంతంగా త‌మ కుటుంబం నుంచి కూడా పేద‌ల‌ను ఆదుకునేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఎంపీ చెప్పారు. అయితే క‌రోనా మహమ్మారి నుంచి తెలుగు రాష్ట్రాల‌ను కాపాడేందుకు ఐక్య‌త‌తో ముందుకు సాగాల‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎంపీకి సూచించారు. ఇదిలా ఉండ‌గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగ‌ళ‌వారం రాత్రి 8గంట‌ల‌కు జాతినుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై మాట్లాడనున్నారు. 


ఆయ‌న చెప్ప‌బోతున్నార‌నే దానిపై దేశ ప్ర‌జానీకంలో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండ‌గా  భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 71వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 3,604 కేసులు నమోదుకావ‌డం వ్యాధి వ్యాప్తి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. దేశంలో కరోనా కేసులు 70,756కి చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దేశంలో రోజురోజుకు వేగంగా పెరుగుతున్న క‌రోనా కేసులు ఒక‌వైపు... మ‌రోవైపు ఆర్థిక ప‌త‌నం జ‌రుగుతున్న వేళ ప్ర‌ధాన‌మంత్రి ఏం నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది మ‌రికొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: