ఒకవైపు ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంటే... మరోవైపు హాస్పిటల్ లో ఘోరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం కూడా సెయింట్ పీటర్స్ బర్గ్ ఆస్పత్రిలో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. హాస్పిటల్ లోని వెంటిలేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ ఘోరమైన అగ్ని ప్రమాదంలో ఐదు మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ఇకపోతే, నిజానికి వెంటిలేటర్ నుంచి మంటలు వ్యాప్తి చెందడానికి ఓవర్ లోడ్ కారణం అని తెలుస్తుంది. ఇక మరణించిన వారు అంతా కూడా వెంటిలేటర్ లోనే ఉండటం వల్లనే మృతి చెందారు వారు అందరూ. 

 

ఇక కరోనా రోగుల కోసం చికిత్స అందిస్తున్న సెయింట్ పీటర్స్ బర్గ్ ఆస్పత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.. వీరితోపాటు మొత్తం 19 మంది మరణించినట్లు వైద్యులు అంటున్నారు. కానీ మృతుల సంఖ్య మాత్రం అధికారికంగా తెలియజేయలేదు. వెంటిలేటర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది అని అందరూ భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తరుణంలో హాస్పిటల్ లో ఉన్న 150 మంది కరోనా రోగులను మంటల  నుంచి కాపాడినట్లు అధికారులు తెలిపారు. 

 


ఇటీవల మాస్కోలోని ఒక హాస్పిటల్ లో కూడా ఇదే తీరులో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అక్కడ కూడా కరోనా రోగుల మరణించారు. తాజాగా రష్యాలో 11,656 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య మొత్తం రెండు లక్షలకు దాటింది. మరణాల సంఖ్య చూస్తే రెండు వేలకు పైగానే ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అయిన ఒక్క మాస్కో లోనే దాదాపు ఆరు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరిగింది. కరోనా ట్రీట్మెంట్ కోసం వెళితే చివరకు వారు ఇలా సజీవ సమాధి అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: