సోషల్ మీడియా అంటేనే ఎంతో నెగిటివిటీని, తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసే మాధ్యమం అని వర్ణించవచ్చు. ఇందులోని వినియోగదారులు ఒకళ్ళని ఒకళ్ళు వేధించడం, బ్లాక్మెయిల్, ట్రోలింగ్ చేయడం లాంటివి ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. ఇటువంటివి 70 శాతం సోషల్ మీడియాలో ఉంటే 30 శాతం మాత్రమే మామూలు ప్రజలందరికీ ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. వీటిలో కొన్ని అందర్నీ సంతోష పరచడంతో పాటు కొన్ని వీడియోలు ఆశ్చర్య పరుస్తాయి. క్యూట్ అనిమల్స్ వీడియోలు, చిన్న పిల్లల వీడియోలు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా దొరుకుతుంటాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My momma got a DIY pizza KIT from @chichos_pizza tonight for dinner! We’ve never done this before and it was so much fun! I was very focused and so excited... well.. because of cheese of course! AND It was a lot of fun to play with that big squishy thing in the beginning too 🤣🍕 I hope they keep the DIY kits around forever!

A post shared by KOBE EATS (@kobe_yn) on


అయితే ఇటీవల ఒక చిన్న పిల్లోడికి సంబంధించిన వీడియోలు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోబే అనే పేరుతో ఇంస్టాగ్రామ్ ఖాతా తెరిచిన ఆ చిన్నారి తల్లిదండ్రులు తన బాబు ప్రిపేర్ చేసే వంటకాలకు సంబంధించిన దృశ్యాలను నెట్టింట ప్రతిరోజు అప్లోడ్ చేస్తారు. ఈ పిల్లోడికి కేవలం ఒక్క ఏడాది వయసు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ చిన్నారి ఇంస్టాగ్రామ్ ఖాతాలో మొట్టమొదటి వీడియో పోస్ట్ కాగా... ప్రస్తుతానికి 5 లక్షల 30 వేల మంది ఆ ఇంస్టాగ్రామ్ ఖాతా ని ఫాలో అవుతున్నారు. ఫాలోవర్ల సంఖ్య 3 లక్షలకు చేరుకున్నప్పుడు కోబే, తన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోబే ఖాతా లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియోకి కనీసం 5 లక్షలకు పైగా వీక్షణలు, లక్షల పైచిలుకు లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు వస్తాయి. 

 


ఈ వీడియోలలో కోబే కుకింగ్ ఎలా చేయాలో చెప్పడు కానీ తయారుచేసే క్రమంలో ఆహార పదార్థాలు తింటూ ఉంటాడు. ఇక ఆ దృశ్యాలను చూసిన ఫాలోవర్లు తెగ ముచ్చట పడిపోతుంటారు. కోబే ప్రతి వంటకం చేయడానికి తన అమ్మ సహాయపడుతుంది. ఈ బాలుడు ఇప్పటివరకు ఎన్నో ప్రత్యేక వంటకాలను తయారు చేసే ఆడవారికి కుకింగ్ గోల్స్ పెంచేసాడు. ఈ చిన్నోడి వీడియోలు వైరల్ కావడానికి రీజన్ ఏంటంటే... తను వంటకం చేస్తున్నంతసేపు హాయిగా నవ్వుతూ... ఎంతో సంతోషంగా ఉంటాడు. ఆ ముచ్చటైన దృశ్యాలు ఒక వర్గం ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: