భారత దేశంలో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా కేసులు ఒక్కొక్కటిగా నమోదు అవుతూ.. మార్చినాటికి బాగా పెరిగిపోయాయి. దాంతో మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.   లాక్ డౌన్ వల్ల పేద మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పనిచేసే వలస కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. పూటగడవక తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. అటు సొంత ఊళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యం లేక కొంత మంది కూలీలు కాలి నడకన తమ సొంత ఊళ్లకు వెళుతున్నారు.  ఈ మద్య వలస కూలీల ఇబ్బందులు గమనించిన కేంద్ర వారిని సొంత ఊళ్లకు వెళ్లేందుకు పరిమిషన్ ఇచ్చింది. దాంతో ఇప్పటి వరకు నానా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు లక్షల్లో తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. 

 

ఈ నేపథ్యంలో పలు చోట్ల వలస కూలీలు పెద్ద ఎత్తున ఆందోళనలు.. లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పపడుతున్నారు.  ఈ మద్య ఉత్తర్‌‌ ప్రదేశ్‌, బీహార్‌‌, పశ్చిమబెంగాల్‌కు వెళ్లేందుకు ట్రైన్లు నడపాలని డిమాండ్‌ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు వాళ్లపై లాఠీ చార్జ్‌ చేశారు.  ఇక ఉత్తరప్రదేశ్ కు గత 5 రోజుల్లో ఏకంగా 4 లక్షల మంది కార్మికులు, కూలీలు శ్రామిక్ రైళ్లు, బస్సుల్లో చేరుకున్నారు. నిన్న ఒక్క రోజే లక్ష మంది చేరుకోవడం గమనార్హం.

 

వలస కూలీల కోసం యూపీ ప్రభుత్వం బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఇటీవల వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకున్న తర్వాత క్వారంటైన్ లో ఉండకపోవడం.. ఆరోగ్య భద్రతలు పాటించకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల వైరస్ మరింత పెరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా లక్షలాది మంది వస్తారని చెప్పారు. వీరంతా క్వారంటైన్ నిబంధనలను పాటించకపోతే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: