ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టు లో నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు టీఎంసీల మీరు వినియోగించుకోవచ్చని జీవో జారీ చేయడం జరిగింది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ని లెక్క చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి వ్యవహరించిన ఈ తీరు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సందర్భంగా ఇటీవల జగన్ వ్యవహరించిన తీరును కేసిఆర్ సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని ఉన్నతాధికారులతో తేల్చి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ బోర్డు ట్రిబ్యునల్ లో ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని అధికారులకు కేసీఆర్ స్పష్టం చేశారు.

 

పంతం పట్టే విధంగా కేసిఆర్ ఈ విషయంలో వ్యవహరించడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ విషయం గురించి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలలో ఏపీ తెలంగాణలకు స్పష్టమైన కేటాయింపులు ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఇండైరెక్టుగా కెసిఆర్ ప్రభుత్వం పై ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది వచ్చిన ఎనిమిది వందల టీఎంసీల సముద్రంలో కలిసిపోయాయని అన్నారు.

 

రానున్న రోజుల్లో కృష్ణా వరద తగ్గిపోతుందని ఎక్కువ వరదలు తీసుకునేందుకు 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కుల వ‌ర‌కు డ్రా చేసి రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాలకు ఇబ్బంది లేకుండా ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్టు అనిల్ తెలిపారు. అయితే తెలంగాణ ప్రాంతానికి నష్టం వచ్చేలా ఏ పని చేయలేదని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎవరు కోర్టుకెళ్లిన పర్వాలేదు న్యాయం మా వైపే ఉంది అన్నట్టుగా మంత్రి తెలిపినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే పంతం పట్టిన కేసీఆర్ కోర్టుకు వెళ్లినా గానీ జగన్ కోర్టుకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన తీర్పు ఈ విషయంలో తీసుకురావడానికి ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: