విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై రగడ ఆడగం లేదు. ఈ ఘటనపై చంద్రబాబు ఇంకా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇది పూర్తిగా జగన్ ప్రభుత్వం వైఫల్యమే అంటూ ఫైర్ అయిపోతున్నారు. అలాగే ఎల్జీ పాలిమర్స్ సంస్థలో తమ పాపం ఏమి లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఇందులో ఏమి జరిగిన గత ప్రభుత్వాలదే బాధ్యత అని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తప్పే ఉందంటూ మాట్లాడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే బాబు ఓ కెమికల్ ఇంజినీర్ అవతారమెత్తారు. 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉండాల్సిన స్టైరీన్, 130-150డిగ్రీలకు చేరిందంటే అది కంపెనీ తప్పిదమే అని, సెల్ఫ్ పాలిమరైజేషన్ కు కెమికల్ కలపాల్సివుండగా, అది చేయకుండా వదిలేశారని చెప్పారు.

 

ఇంకా ద్రవరూపంలో ఉండే స్టైరీన్ గ్యాస్ రూపంలో ఎలా మారింది..? 500మీటర్ల పరిధి కూడా వ్యాపించలేని గ్యాస్ 3కిమీ-5కిమీ పరిధిలో ఎలా వ్యాపించింది..? దుర్ఘటన ప్రాంతానికి వెళ్లకుండా, కంపెనీ ప్రతినిధులను విమాశ్రయంలో సీఎం జగన్ ఎందుకు కలిశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాకపోతే ఇన్ని ప్రశ్నలు వేసిన బాబు...వీటికి జవాబు ఇచ్చేవాళ్ళు లేరంటూ బాధపడుతున్నారు.

 

అయితే జగన్ ప్రభుత్వం గ్యాస్ లీకేజ్ ఘటనపై ఓ కమిటీ వేసి, నిజానిజాలను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ కమిటీలో  ఉన్నవారికి కెమికల్ గురించి ఏమి తెలుసని బాబు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని బాబుకు రివర్స్ లో కౌంటర్లు వస్తున్నాయి. అయినా బాబు ఏమన్నా కెమికల్ ఇంజినీరింగ్ చదివారా? ఏది ఎంత కలపాలి, ఎలా చేయాలి అనేది అడుగుతున్నారు. అదంతా తానే దగ్గరుండి పని చేసినట్లు చెబుతున్నారు.

 

ఏదో రాజకీయంగా విమర్సలు చేయాలి కాబట్టి, బాబు నచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అసలు కమిటీ వేసిందే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుకోవడానికి, కమిటీ రిపోర్ట్ వచ్చాక అన్ని విషయాలు బయటపడతాయి. కానీ ఈలోపు ఆగలేని బాబు..కెమికల్ రియాక్షన్స్ గురించి మాట్లాడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: