కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రైల్వే ప్రయాణికులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాదాపు దేశంలో రవాణా సంస్థలు తెరవటానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. లాక్ డౌన్ కారణంగా దాదాపు 45 రోజులకు పైగా ప్రజారవాణా ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. ఇటువంటి సమయంలో మే 17 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు కదులుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ విషయంలో అదేవిధంగా తప్పనిసరిగా ప్రయాణికులు మాస్క్ ధరించే విధంగా కొన్ని ప్రమాణాలు పాటిస్తూ బస్సులను కదిలించడానికి జగన్ సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మే 17వ తారీకు తో మూడవ దశ లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

 

ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడో ద‌శ లాక్ డౌన్ క్లోజ్ అవ్వకముందే కేంద్ర ప్రభుత్వం కొన్ని రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మనందరం చూశాం. సుదీర్ఘ ప్ర‌యాణాలు చేసే రైళ్ల‌నే క‌దిలిస్తున్న‌ప్పుడు స్థానికంగా తిరిగే బ‌స్సుల‌ను క‌దిలించ‌డంలో పెద్ద సమస్య అంటూ ఏమీ ఉండదు. దీన్ని బట్టి చూస్తే చాలావరకూ ప్రజారవాణా మళ్లీ మొదలు పెట్టాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అర్థం అవుతుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా ఇప్పటికే బాగా నష్టం చేకూరడంతో తప్పకుండా మే 17 త‌ర్వాతే ఆర్టీసీ బ‌స్సుల‌ను వ‌ద‌ల‌నుంది ఏపీ ప్ర‌భుత్వం.

 

దీంతో లాక్ డౌన్ నుంచి మ‌రింత మిన‌హాయింపు ల‌భించిన‌ట్టే అని స్ప‌ష్టం అవుతోంది. లాక్ డౌన్ త‌ర్వాత భారీగా ఆర్టీసీ చార్జీల‌ను పెంచుతార‌నే ప్ర‌చారాన్ని కూడా ఏపీ ప్ర‌భుత్వం ఖండించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలను పెంచే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కేవలం జిల్లాల స్థాయిలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: