జగన్ పార్టీకి ఆయన సన్నిహితులకు చంద్రబాబుతో ఎంత శత్రుత్వం ఉందో అదేవిధంగా ఏబీఎన్ అనే టీవీ ఛానల్ తో అదే స్థాయిలో వైరం ఉంది. చాలా వరకు ఏబీఎన్ నీ మరియు తెలుగుదేశం పార్టీని ఏ మాత్రం వేరు వేరుగా ఎప్పుడూ కూడా చూసిన సందర్భాలు లేవు. ఇదే సమయంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్న టైంలో చాలావరకు ఏబీఎన్ ఛానల్ కి సంబంధించి విలేకరులకు అనుమతి ఇవ్వలేదు. కొన్నిసార్లు చెప్పకుండా జగన్ తన మీడియా సమావేశాల్లో వచ్చిన ఏబీఎన్ విలేకరులకు అనుమతి లేకుండా ఎవరూ రమ్మన్నారు అని సీరియస్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో వైసీపీలో జగన్ తర్వాత ఎక్కువగా వినబడే విజయసాయిరెడ్డి కూడా ఏబీఎన్ ఛానల్ పై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు.

 

అటువంటి విజయసాయిరెడ్డి ఇంట్రెస్ట్ ఒక్కసారిగా ఏబీఎన్ ఛానల్ పై మళ్లింది. పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి గ్యాస్ లీక్ అవడంతో ఆ ప్రాంతాలలో ప్రజలంతా భయభ్రాంతులకు గురై బయట వేరే చోట ఉండటం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అక్కడ శానిటేషన్ జరిపించి ప్రమాదకరమైన గ్యాస్ లీక్ ముప్పు కు గురైన ప్రభావిత గ్రామాలలో మంత్రులు పడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఓ ఇంటిలో పడుకున్న విజయసాయిరెడ్డి ఉదయాన్నే లేచి మంచం మీద కూర్చుని మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

సాధారణంగా విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఛానల్స్ ని జగన్ మాదిరి తన ఇంటర్వ్యూలకు పిలవరు. అటువంటిది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ కి కూడా ఇటీవల  ఇస్తున్న ఇంటర్వ్యూకి పిలుపు ఇవ్వటంతో చాలామంది ఏంటి విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ఇలా మారిపోయారు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏబీఎన్ ఛానల్ కూడా విజయసాయి రెడ్డి ఇంటర్వ్యూ టీవీ ఛానల్ లో ప్రసారం చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: