ప్రస్తుతం దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. భారత దేశంలోని ముఖ్య నగరాల్లో అయితే రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక గ్రామాల విషయానికొస్తే మాత్రం ఈ వైరస్ ప్రభావం తక్కువగానే ఉంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం విధించిన మూడో విడత లాక్ డౌన్  మే 17 తో ముగుస్తుంది... ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఆరెంజ్ జోన్ లలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తేవేసి రెడ్ జోన్ లో అలాగే  కొనసాగించాలని భావిస్తున్నట్టున్నట్లు  తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక ఛాలెంజ్ విసిరారు. 

 

 కరోనా  వైరస్ ను  ఆయా నగరాల్లో కంట్రోల్ చేయడంతోపాటు గ్రామాలకు అసలు పాకకూడదు  అని దీని కోసం తగిన చర్యలు చేపట్టాలని అంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చాలెంజ్ చేశారు. ఇక మామూలుగానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంకొన్ని రోజుల వరకు మహమ్మారి వైరస్ తో సహజీవనం తప్పదు అని తమ తమ రాష్ట్రాల పరిధిలోని ప్రజలకు... దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నగరాల్లో కి వచ్చి వ్యాపించి అందరిని భయాందోళనకు గురి చేస్తున్న వైరస్ ను...  గ్రామాల వరకు మాత్రం పోనీవద్దు అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 

 

 ప్రస్తుతం దేశంలో 70 శాతానికిపైగా గ్రామాలే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఛాలెంజ్  ముఖ్యమంత్రులు  అందరూ స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేవలం రెడ్ జోన్  పరిధిలో తప్ప మిగతా జోన్ లలో లాక్ డౌన్  ఎత్తివేసే అవకాశం ఉంది కాబట్టి.. ఈ క్రమంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని నగరాల నుంచి పల్లెలకు ఈ మహమ్మారి వైరస్  రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: