విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ దుర్ఘటన లో  అధికారులు హుటాహుటిన స్పందించి చాలా మంది ప్రజల ప్రాణాలను కాపాడారు. దీంతో ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం తక్కువగానే జరిగింది చెప్పవచ్చు . ఇక ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు ప్రభుత్వం భారీ మొత్తంలో ఆర్థిక సహాయం కూడా అందించారు. క్లిష్ట  పరిస్థితుల్లో కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ప్రశంసలు కూడా అందుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం ప్రభుత్వం బాధితుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఎన్నో విమర్శలకు దారితీస్తోంది అంటున్నారు విశ్లేషకులు. 

 

 విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు చెందిన సభ్యులు తీవ్ర ఆవేదనతో ఆగ్రహంతో ఉంటారని  గ్యాస్ లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించినప్పటికీ.. వారు ఆగ్రహావేశాలతో  మాట్లాడుతూ ఉంటారని ఈ సమయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఒక తండ్రి పాత్ర పోషించే వారిని సముదాయించే ప్రయత్నం చేయాలని బాధిత కుటుంబాలపై కేసులు నమోదుచేసి జైలుకు తరలించడం సరైనది కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


 ఎందుకంటే ప్రస్తుతం బాధిత కుటుంబాలన్ని తీవ్ర దుఃఖంలో మునిగి పోయాయి కాబట్టి తమకు పరిహారం వద్దు తమ ప్రియమైన వారిని తెచ్చి ఇవ్వండి అని ఆగ్రహంతో మాట్లాడుతూ ఉంటారని.. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించి వారికి సముదాయించి.. ఆ కంపెనీని  అక్కడినుంచి తరలిస్తామని చెప్పడం గానీ  మరేదైనా చెప్పి వారిని సముదాయించే ప్రయత్నం చేయాలి కానీ ప్రభుత్వం ఆగ్రహంతో వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయడం తగదు అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: