ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తూ  ఎంతో మంది ప్రజలను బలి తీసుకుంటుంది మహమ్మారి కరోనా వైరస్. ఆధునిక పరిజ్ఞానం ఉండి ఎంతో నిబద్ధతతో కూడిన ప్రజానీకం ఉన్న అగ్రరాజ్యాలలో  సైతం ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ మహమ్మారి వైరస్ మాత్రం విలయతాండవం  చేస్తూనే ఉంది . ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఇతరులు చేసిన తప్పు మరొకరి పాలిట  శాపంగా మారి మహమ్మారి దరి చేరుతుంది. 

 

 

 ముఖ్యంగా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం వృద్ధులు చిన్న పిల్లలపై ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధుల్లో రోగనిరోధకశక్తి అతి తక్కువగా ఉంటుంది కాబట్టి 60 ఏళ్ల పైబడిన వారు ఈ మహమ్మారి వైరస్ బారిన పడితే బతకడం కష్టమే అంటూ నిపుణులు సైతం చెబుతున్నారు. ఇక కొన్ని దేశాల్లో అయితే తమ దేశ పరిధిలో యువకులను మాత్రమే రక్షించుకుంటాం అని వృద్ధులను రక్షించుకోలేం  అంటూ స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. అయితే ఈ వైరస్ ద్వారా ఎక్కువగా వృద్ధులకే ప్రాణభయం ఉంది అని నిపుణులు అంటున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం నిపుణుల అంచనాలను తారుమారు చేస్తూ అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా నూరేళ్ళు నిండిన వృద్ధులు సైతం ఈ మహమ్మారిని జయించి కోలుకుంటు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ప్రజల్లో మరింత ధైర్యాన్ని కూడా నింపుతుంది. 

 

 

 తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. ఇప్పటివరకు కరోనా వైరస్ పోరాటంలో ఎంతో మంది వృద్ధులు విజయం సాధించగా తాజాగా స్పెయిన్కు చెందిన 113 బామ్మ ఈ మహమ్మారి వైరస్ తో పోరాడి మృత్యుంజయరాలు అయ్యింది. మరియా బ్రన్యాస్ అనే 113 ఏళ్ల బామ్మ కరోనా వైరస్ సోకి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకుంది . ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న ఈ వృద్ధురాలు ఓల్డ్ ఏజ్ హోమ్ లోని తన గదిలోనే ఐసోలేషన్ లో  ఉంటూ ఈ మహమ్మారి వైరస్ భారీ నుంచి బయటపడింది. కాగా ఇప్పటి వరకు ప్రపంచంలోనే కరోనా  వైరస్ బారి నుంచి బయటపడ్డ అతి పెద్ద వయస్కురాలుగా  రికార్డు సృష్టించింది ఈ బామ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: