కృష్ణా నదీ అదనపు జలాల వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ మధ్య లడాయి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు, ఇతర వర్గాలు తమ రాష్ట్రం వాదన వినిపించడం ప్రారంభించాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఇంజనీర్ల సంఘం బహిరంగ లేఖ రాసింది. సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3 టీఎంసీల ఎత్తిపోతల పై అపోహలు వద్దని స్పష్టం  చేసింది. 

 


రాయలసీమ తాగునీటి అవసరాలకు మాత్రమే ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును అడ్డుకోవద్దని ..  తెలంగాణా విశ్రాంత ఇంజనీర్లు, ఆ రాష్ట్ర ప్రతిపక్షాలకు ఈ లేఖ రాసింది.  67 వేల 710 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించిన రాయలసీమ ప్రాంతంలో 5125 గ్రామాల్లో ఉన్న 1.64 కోట్ల మంది ప్రజలకు తాగునీరు అందించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని  విశ్రాంత ఇంజనీర్లు అంటున్నారు. వరదనీటిని వినియోగించుకుని రాయలసీమలోని రిజర్వాయర్లను నింపాలన్నదే ఏపీ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో కనీసం నాలుగేళ్లకు ఓమారైన నీటిని నింపితే అక్కడున్న ప్రజలకు తాగునీరు అందుతుందని జీవనోపాధి మెరుగవుతుందని లేఖలో పేర్కోన్నారు. 

 


తెలంగాణలో కృష్ణా అదనపు జలాలతో  నిర్మించిన కల్వకుర్తి, నెట్టెంపాడు , ఎస్ఎల్ బీసీ లాంటి ప్రాజెక్టులు ట్రైబ్యునల్ నుంచి అనుమతి లేకున్నా వాటి సామర్ద్యాన్ని పెంచేందుకు తెలంగాణా ప్రయత్నించిందని లేఖలో విశ్రాంత ఇంజనీర్లు ప్రస్తావించారు. అదనపు జలాల ఆధారంగానే దిండి ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టులను కూడా తెలంగాణాలోప్రతిపాదించారని ఇంజనీర్లు పేర్కోన్నారు.  రాష్ట్ర పునర్విభజన తర్వాత మహబూబ్ నగర్, నల్గోండ జిల్లాలకు ప్రయోజనం కల్పించేలా అనేక చర్యలు తెలంగాణ చేపట్టిందన్నారు. 

 


90 టీఎంసీల సామర్ధ్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల,  30 టీఎంసీల సామర్ధ్యంతో  దిండి ఎత్తిపోతల , మిషన భగీరధ, భక్త రామదాస్ ఎత్తిపోతల, తుమ్మిళ్ల ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టులతో 178 టీఎంసీల నీటిని తీసుకునేందుకు  ఎలాంటి కేటాయింపులు లేకపోయినా తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టారని పేర్కోన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఆ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాద్యమైందని.. అలాగే రాయలసీమ తాగునీటి అవసరాల కోసం అదనపు జలాలను వినయోగించుకునేందుకే ఏపీ ఈ ప్రాజెక్టు చేపట్టిందని దీనికి సహకరించాల్సిందిగా ఏపీ ఇంజనీర్లు లేఖలోకోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: