లాక్ డౌన్ భాగంగా కేంద్ర ప్రభుత్వం కొంచెం కొంచెంగా దేశ రవాణా వ్యవస్థను మళ్లీ పునః ప్రారంభం చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు లాగ్ డౌన్  కారణంగా దేశ రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచి వేయబడింది. రోడ్డు రవాణా రైలు రవాణా విమానయాన సర్వీసులు పూర్తిగా నిలిపి  వేయబడ్డాయి. ఇక దాదాపు 40 రోజుల తర్వాత ప్రస్తుతం లాక్ డౌన్  సడలింపు లో భాగంగా పలు నిబంధనలతో కూడిన రవాణా వ్యవస్థను ప్రస్తుతం పున ప్రారంభిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పలు కీలక నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా ప్రయాణికులు అందరికీ ఆరోగ్యం సేతు యాప్ తప్పనిసరి అని సూచించింది. 

 

 

 దేశ ప్రజల సంక్షేమార్థం కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్  విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ యాప్ ద్వారా కరోనా వైరస్ లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పటికే ఈ యాప్ ను  ఐదు కోట్లకు పైగా మంది డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు.  ఈ యాప్ ద్వారా కరోనా  వైరస్ లక్షణాలు ఉన్నాయా లేవా  అనే విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రయాణికులు అందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు  తప్పనిసరిగా మారిపోయింది. 

 

 

 అటు విమాన ప్రయాణం చేయాలనుకున్నా లేదా ఇటు రైలు ప్రయాణం చేయాలనుకున్న  ఆరోగ్య సేతు యాప్  తప్పనిసరిగా మొబైల్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. ప్రస్తుతం రైలు రవాణా ని ప్రజలందరికీ కొంచెంకొంచెంగా అందుబాటులోకి తెస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే రైలు ప్రయాణం చేసుకునే వారు తప్పనిసరిగా ఆరోగ్య సేవ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ అప్పటి వరకు ఎవరైనా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోని వాళ్ళు ఉంటే స్టేషన్కు వచ్చిన తర్వాత అయినా సరే ఈ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ సూచించింది.  ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న  తర్వాతనే లోపలికి అనుమతిస్తారు అంటూ స్పష్టం చేస్తోంది.  ఈ మేరకు రైల్వేశాఖ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టింది.  ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అందరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: