ఇప్పటికే బద్మాష్ గాళ్లు కొందరు బాబాల వేషం వేసుకుని, స్వామీజీల్లా మారి  ప్రజలను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ లొంగతీసుకుంటున్నారన్న విషయం తెలిసిందే.. తామే దేవుళ్లమని చెప్పుకుంటున్న కొందరిని చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్ధం కానీ పరిస్దితి కూడా అప్పుడప్పుడు ఎదురవు తుంది.. మనోవాంఛలను జయించలేని దౌర్భాగ్యులందరు దేవుళ్ళం అని చెప్పుకుని తిరుగుతుంటే లోకం నాశనం అవక ఏమవుతుంది.. పుస్తకంలో ఉన్న సూర్యుని బొమ్మను చూపించి సూర్యకాంతి వస్తుంది అంటే రాదు కదా.. హోటల్‌లో సర్వరు వంటల పట్టిక ఎంతసేపు ఏకరువు పెట్టినా ఆకలి తీరదు కదా.. అలాగే పిచ్చిపట్టిన వాళ్లు భగవంతులని చెప్పుకున్నంత మాత్రాన వారు దేవుళ్లుగా మారరు..

 

 

ఇకపోతే.. దాదాపుగా మనుషుల మనసులు మాలిన్యాన్ని అంటించుకుని జీవిస్తుండగా, ఇప్పటి వరకు అన్ని చోట్ల ఆడవాళ్లపట్ల లైంగిక వివక్షనే ప్రదర్శిస్తున్నారు పురుషులు.. అయితే యోగా నేర్పే గురువుల విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.. కానీ ఇప్పుడు ఆలోటు కూడా తీరింది.. అదేమిటంటే.. ఇద్దరు యోగ గురువులు మరో వ్యక్తితో కలిసి యోగ నేర్చుకోవడానికి జపాన్ నుంచి, ఇండియాలోని ఉత్తరాఖండ్ కు వచ్చిన ఓ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం చర్చకు దారితీసింది.. భారతదేశం పై ఉన్న గౌరవంతో ఇండియాకి వచ్చి ఉత్తరాఖండ్ లోని యోగ కేంద్రంలో చేరిన ఆ యువతికి, ఇక్కడ ఎదురైన సంఘటన పట్ల షాకై వారిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది..

 

 

దీంతో పోలీసులు ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న ఇద్దరు గురువులతో పాటుగా, వంటశాలలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుని విచారిస్తున్నారు.. ఇకపోతే యోగ విద్యను అత్యధికంగా బోధించే కేంద్రాలు ఇండియాలోనే ఉండటం వల్ల,  యోగాను నేర్చుకోవడానికి అనేక దేశాల నుంచి ప్రజలు ఇండియాకు వస్తుంటారు.. ఇలాంటి కొందరు చేసే నీచమైన పనుల వల్ల మనదేశం పేరు ప్రతిష్టలు విదేశాల్లో కూడా దిగజారుతాయి.. అందుకే ఆత్మశుద్ధి లేనిది ఏపని చేసిన వ్యర్ధమే.. నిన్ను నువ్వే మార్చుకోలేనప్పుడు ఇతరులను మార్చడం సాధ్యం కాదు అంటారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: