మన దేశంలో ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రభావం మొదలైందో అప్పటి నుంచి అన్ని విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారికి మందు లేదు.. అందుకే ఆరోగ్య సూత్రాలు పాటించాలని.. సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు ధరించాలని చెబుతున్నారు.  ఇక ఎవరైనా తుమ్మినా.. దగ్గినా దూరంగా ఉండాలని చెబుతున్నారు. కానీ కొంత మంది జనాలకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. గతంలో ఎలా ఉంటున్నారో అలాగే ఉండటంతో వ్యాధి రోజు రోజుకీ విస్తరిస్తుంది.  భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 122 మంది ప్రాణాలు కోల్పోయారు.  

 

ఇక మరణాల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది.. నేటికి మృతుల సంఖ్య 2,415కి చేరింది. ఇక ఏపిలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.   ఏపీ నుంచి నిత్యం కూరగాయలను తీసుకొని అనేక లారీలు చెన్నై లోని కోయంబేడు వెళ్తుంటాయి.  తమిళనాడు సరిహద్దు జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు నుంచి ఎక్కువగా కూరగాయలనును చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు తరలిస్తుంటారు.  ఇటీవల ఈ ప్రాంత వాసులకు కరోనా వైరస్ సోకడంతో నెల్లూరు, చిత్తూరు  వాసులకు ఎక్కడ లేని భయం పట్టుకుంది.

 

తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా కూరాయలు చెన్నై వెళ్తుంటాయి.  ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదవుతున్న కేసులు ఎక్కువగా చెన్నై వెళ్లొచ్చిన వాళ్లకు వస్తుండటంతో దీనిపై అధికారులు దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే.. ఈ మూడు జిల్లాలతో పాటుగా చైన్నై నుంచి ఇటీవలే లారీలో తెనాలి వచ్చిన యువకుడికి కరోనా సోకడంతో ప్రభుత్వం అధికారులు అలర్ట్ అయ్యారు.  తెనాలి వచ్చిన తరువాత ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నాడు అనే విషయాలను ఆరా తీస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: