గ‌త రెండు నెల‌లుగా క‌రోనా వైర‌స్ ప్రపంచ‌మంతా కూడా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. చిన్న పెద్దా..పేద ధ‌నిక ఇలా ఏమీ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రినీ ఈ వ్యాధి చుట్టేస్తుంది. నానా ఇబ్బందులు పెట్టేస్తుంది. దీంతో ఈ వ్యాధి బారిన ప‌డి ఇప్ప‌టికే చాలా మంది మృతి చెందారు. ఇక ఈ వ్యాధి ఎక్కువ‌గా పిల్ల‌లో మ‌రియు వృద్ధుల్లో క‌నిపిస్తుంది. వారికి రోగ‌నిరోధ‌క శ‌క్తి కాస్త త‌క్కువ‌గాఉండ‌డంతో వారు అతి త‌క్కువ కాలంలోనే వ్యాధి బారిన ప‌డే అవ‌కాశాలు కాస్త ఎక్కువ‌గా ఉన్నాయి. 

 

అలాగే వైధ్యులు చెప్పిన‌ట్లు జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఈ వ్యాధి నుండి కోలుకుంటున్న వారు కూడా భారీగానే ఉన్నారు. పిల్లలు ఎక్కువ శాతం కరోనా జయిస్తున్నట్లుగా రిపోర్ట్‌ అందుతుంది. ఇక పిల్లలకు కరోనా సోకినా మూడు వారాల్లో వారు నెగటివ్‌కు వచ్చేస్తున్నార‌ట‌. అయితే  పిల్ల‌ల మరణాల శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే క‌రోనాని జ‌యించిన పిల్ల‌లో మ‌రో కొత్త స‌మ‌స్య క‌న‌ప‌డుతుందంట‌. అదేమిటంటే...

 

అమెరికా న్యూయార్క్‌లోని వంద మంది పిల్లలకు కవాసాకీ అనే చిత్రమైన రోగం వచ్చింది. ఇప్పటికే ఆ వ్యాధి సోకి అయిదుగురు పిల్లలు మృతి చెందారు. అయితే ఈ జబ్బు బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ శాతం మంది కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారే ఉండ‌టం గ‌మ‌నార్హం అని చెప్పాలి. అంటే కరోనాను జయించిన పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అజాగ్రత్తగా ఉంటే పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలంటూ న్యూయార్స్‌ మేయర్‌ సూచించారు.

 

ఈ జబ్బుతో బాధపడుతున్న పిల్లల్లో అధిక జ్వరం, నీరసంగా ఉండటం, ఆకలి వేయక పోవడం, దురదలు రావడం, పొట్టలో నొప్పి రావడం, వాంతులు చేసుకోవడం వంటివి చేస్తారు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వారిని చికిత్సను చేయించాల‌ని మంచి వైధ్యుల‌ను సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు. 
కరోనా మహమ్మారి వృద్దులపైన కూడా అధికంగా ప్రభావం చూపుతుందనే విషయం అందరికి తెల్సిందే. అలాగే వారికి ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు గుండె సంబంధిత సమస్యలు మరియు డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు ఎంతో మంది కరోనా బారిన పడి మృతి చెందిన దాఖలాలు నమోదు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: