అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా మే 12వ తేదీ నాడు జరుపబడుతుంది. వైద్య రంగంలో నర్సరీ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికి మే 12వ తేదీని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నర్స వృత్తిలో పనిచేస్తున్న ప్రతి ఒక మహిళను ప్రశంసించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సినీ రాజకీయ ప్రముఖులు... నర్సులు చేసే గొప్ప పనిని మెచ్చుకున్నారు. ఇందులోని భాగంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నర్సుల సేవలని ప్రశంసించారు.


‘కరోనా తో రోగులను సంరక్షిస్తున్న గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తి లో ఉన్న ప్రతి నర్సుకి నా తరఫున, జనసేన పార్టీ తరఫున అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆయన ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వృత్తి రీత్యా నర్సులు అయినా మనమందరం సిస్టర్ అనే పిలుస్తామని... ఆ పిలుపుతోనే తమ ఫ్యామిలీ సభ్యులకు సేవ చేసినట్టు ముక్కుమొహం తెలియని అందరు రోగులకు నర్సులు సేవ చేస్తారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.


కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ 19 బాధితులకు సేవలు చేస్తున్న నర్సులు చాలా గొప్పవారని ఆయన అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ వారసత్వాన్ని కరోనా సమయం లో కూడా నర్సులు బాగా కొనసాగిస్తున్నారని... వారి సేవలు అందరికీ చాలా అవసరముందని తెలియజేసాడు. నర్సింగ్ విభాగం లో పనులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ ప్రదమైన శాలరీలు ఇవ్వాలి... వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప్రతి సమస్య పై మాట్లాడుతున్నారు. విశాఖ విషపూరిత గ్యాస్ లీకేజీ పై కూడా ఆయన గట్టిగా స్పందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: