దేశంలో కరోనా రోజు రోజు కు విజృంభిస్తుంది.  గడిచిన  24 గంటల్లో  దేశ వ్యాప్తంగా  3525 కేసులు నమోదు కాగా  122 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఒడిశా లో ఒక్కసారి గా కరోనా కేసులు భారీగా పెరిగాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల వరకు 101 కరోనా కేసులు నమోదయ్యాయని సమాచారం. వివిధ రాష్ట్రాల నుండి   వస్తున్న  కూలీల వల్ల  కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పెరిగిన  కేసులతో కలిపి ప్రస్తుతం ఒడిశాలో  ఇప్పటివరకు 538 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక ఓవరాల్ గా ఇప్పటివరకు  దేశ వ్యాప్తంగా  74281కేసులు నమోదు కాగా 2415 మంది మరణించారు. ప్రస్తుతం 47480కేసులు యాక్టీవ్ లో వుండగా  24386 మంది కోలుకున్నారని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే కరోనా  కేసులు  పెరుగుతుండడం తో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించనున్నట్లు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.  మే 18లోపు  న్యూ రూల్స్ తో నాలుగో దశ లాక్ డౌన్ మార్గదర్శకాలను ప్రకటించనున్నారు కాగా ఈనెల 17తో మూడో దశ లాక్ డౌన్  ముగియనుంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  మొన్నటి వరకు  తక్కువ కేసు లు నమోదయిన తెలంగాణ లో గత రెండు రోజుల నుండి భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది, అయితే ఆంద్రప్రదేశ్ లో మాత్రం రోజు రోజు కు కేసులు తగ్గుముఖం పగుతున్నాయి.ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైయిన  జాబితాలో ఇండియా ప్రస్తుతం కెనడా ను దాటేసి 12 వస్థానంలో నిలిచింది.  అంతేకాదు అతి త్వరలో ఇండియా , చైనా ను కూడా దాటేయనుంది. చైనాలో 82000 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: