వైసీపీలో ఆ ' కళ ' తప్పినట్టుందే  ? 

 
సినిమా రంగానికి చెందిన వారికి సమాజంలో ఉండే ప్రత్యేకతే వేరు. ప్రజల్లో వారికి కొత్తగా పరిచయం అవసరం లేదు. వారికి అశేషమైన సినీ అభిమానులు ఉండడంతో రాజకీయ పార్టీలు వారిని తమ పార్టీలోకి చేర్చుకుని భారీగా లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. సినిమా రంగానికి చెందిన వారు రాజకీయాల వైపు చూడడం ఎన్టీఆర్ హయాం నుంచి ప్రారంభమైంది. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తో ఎంతో మంది సినీ కళాకారులు అడుగులు వేశారు. ఇక ఆ తర్వాత నుంచి తెలుగుదేశానికి మద్దతుగా సినీ రంగానికి చెందినవారు ఉంటూ వస్తున్నారు.
 
 
 
 ఆంధ్ర, తెలంగాణ విభజన తరువాత సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ కి పరిమితం కావడంతో చాలా మంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. సినీ కళాకారులు మరికొంతమంది టిడిపిని కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారు. ఈ విధంగా నటి జయసుధ, సినీ కమెడియన్ పృథ్వీరాజ్, పోసాని కృష్ణ మురళి, నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు కృష్ణారెడ్డి, జగన్ ku బంధువైన మోహన్ బాబు, కమెడియన్ ఆలీ, ఇలా చాలా మంది వైసీపీకి మద్దతుదారుగా మారారు. దీంతో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోని సినీ కళ ఎక్కువగా కనిపించింది. దానికి తగ్గట్టుగానే జగన్ వారికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పటికే సినిమా రంగానికి చెందిన రోజా వైసీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఆమెకు సముచిత స్థానం ఆ పార్టీలో దక్కింది. అలాగే కమెడియన్ పృథ్వీరాజ్ ఎస్విబిసి చైర్మన్ గా అవకాశం కల్పించారు అయితే ఆయన సొంత తప్పిదాల కారణంగా ఆ పదవిని కోల్పోయారు. 
 
 
ఇక అక్కడి నుంచి సినిమా రంగానికి చెందిన వారి విషయంలో జగన్ వైఖరి మారినట్టుగా కనిపించింది. ఆ రంగానికి చెందిన ఎవరికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్టుగానే జగన్ వ్యవహరిస్తూ వస్తుండడంతో వారికి ఎక్కడా ఆ పార్టీలో ప్రాధాన్యం కనిపించడం లేదు. అలాగే మోహన్ బాబుకి టీటీడీ చైర్మన్ కానీ, రాజ్యసభ సభ్యుడు గాని అయ్యే అవకాశం జగన్ ఇస్తారని ఆశపడినా, జగన్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన అలక చెందారు. ఇక వైసీపీలో మొదటి నుంచి బలమైన వాయిస్ వినిపిస్తూ టిడిపి విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వస్తున్న krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి వ్యవహారంలోనూ జగన్ పెద్దగా పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడం, అసలు సినిమా రంగానికి చెందినవారు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, క్షేత్రస్థాయిలో పార్టీని బలంగా తీసుకు వెళ్ళగలిగే  నాయకులు ఉంటే సరిపోతుంది అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తుండడంతో వారి హడావుడి పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా  విషయంలో కానీ, మరే ఇతర విషయాల్లో కానీ, వైసిపి వారు ఎవరు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం వీరి ప్రస్తావన తెరమీదకు వచ్చింది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: