తెలంగాణలో ఇక కరోనాతో సహజీవనం చేయాల్సిందేనా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజుకు డబుల్ డిజిటల్ సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

 

మంగళవారం తెలంగాణలో కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1326కు ఎగబాకింది. మరణాల సంఖ్య 32కు చేరుకుంది. మేరకు మంగళవారం రాత్రి వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

 

సోమవారం మొదలైనా కరోనా వీర విహారం ఇప్పట్లో ఆగేలా లేదు. అప్పుడు 79 కేసులు నమోదు అవగా ఇప్పుడు మరో 51 కొత్త కేసులు రావడంతో సర్కారు గుండెల్లో గుబులు మొదలైంది. అంతే కాకుండా కరోనాతో మరో ఇద్దరు మరణించారుహైదరాబాద్ మూసాబౌలీకి చెందిన 61 ఏళ్ల వ్యక్తికి కరోనాతో పాటు, బీపీ ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉండడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. జియాగూడ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తికి మదుమేహం, బీపీ కూడా ఉండడంతో చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు. దీనితో చనిపోయిన వారి సంఖ్య 32కు చేరుకుందన్నారు

 

మంగళవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 37 కేసులు నిర్ధారణ అయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వలస కార్మికుల్లో 14 మందికి కరోనా సోకింది. దీనంతటికీ కారణం రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడమే అని వైద్య నిపుణల అభిప్రాయం. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని అందరూ భావిస్తుండగా…. ఇప్పుడు బయటపడుతున్న కేసులు మామూలు గుబులు రేపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: