పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ద్యాన్ని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచనుందని , కృష్ణానదిపై నూతన ప్రాజెక్టును నిర్మించనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ముందే తెలుసా ?, ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని హెచ్చరించిందా ?? అంటే అవుననే  ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి .  పోతిరెడ్డిపాడు సామర్ద్యాన్ని రెట్టింపు చేసి , కృష్ణాజలాలను తరలించేందుకు నూతన ప్రాజెక్ట్ నిర్మించనున్నట్లు అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని , పోతిరెడ్డిపాడు సామర్ద్యాన్ని పెంచే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి , ముఖ్యమంత్రి కెసిఆర్ ను హెచ్చరిస్తూ  బహిరంగ లేఖ రాశారు .

 

అయినా ముఖ్యమంత్రి స్పందించలేదని , ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు . కాంగ్రెస్ పార్టీ హెచ్చరించినప్పుడే స్పందించి , ముందుగానే కృష్ణానది నిర్వహణ యాజమాన్యం  బోర్డుకు , అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు .   గతంతో టిఆరెస్ తో  కలిసి ఉమ్మడి  అంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి , తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంతగా వ్యతిరేకించినా ఖాతరు చేయకుండా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారని , ఇప్పుడు వైఎస్ తనయుడు , ఏపీ  ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పోతిరెడ్డిపాడు సామర్ద్యాన్ని పెంచనున్నట్లు అసెంబ్లీలో  చెప్పడంతో పాటు , బహిరంగ సభల వేదికలపైన పేర్కొంటున్నారని గుర్తు చేశారు .

 

 పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతానని జగన్  బల్ల గుద్ది మరి  చెబుతున్న కెసిఆర్ స్పందించక పోవడం హాస్యాస్పదంగా ఉందని నాగం విమర్శించారు . ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయకముందే తాను చేసిన హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని ఉంటే , ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని నాగం అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: