కరోనా వైరస్ కట్టడి చేసే విషయంలో అన్ని దేశాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయినా ఈ వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గేలా కనిపించక పోవడంతో కరొనాతో కలిసి మరికొంత కాలం పాటు  కలిసి బతకాల్సిందే అన్న అభిప్రాయానికి ప్రపంచ దేశాలన్నీ వచ్చేసాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, మరి కొంత కాలం పాటు కరోనా తో కలిసి సహజీవనం చేయాల్సిందే అని, మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జగన్ ఈ విధంగా మాట్లాడడం సరికాదు అంటూ మండి పడింది. ఈ విషయంలో జగన్ చాలా విమర్శలను ఎదుర్కొన్నారు. 

IHG

 ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల అధ్యక్షులు, ఇలా అందరూ జగన్ మాట్లాడిన ఈ విషయాన్నే వారు కూడా చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కార్నర్ అయ్యింది. ఇదిలా ఉంటే స్వయంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ జగన్ కరోనాకు సంబందించిన విషయంలో జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడడం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై అభినందించిన గల్లా, తాను ఏప్రిల్లో ప్రధానికి ఈ ప్యాకేజీ విషయమై సుంచించాను అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 


అలాగే ఏపీ సీఎం జగన్ చెప్పినట్టుగా కరోనాతో రానున్న రోజుల్లో కలిసి జీవించాల్సిందే అన్న విషయాన్ని కూడా ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
మొన్నటి వరకు ఈ విషయంలో జగన్ తీరును తప్పుపట్టిన తెలుగుదేశం పార్టీ, అదే విషయంలో తమ సొంత పార్టీ ఎంపీ జగన్ సమర్థిస్తూ మాట్లాడటంపై షాక్ కు గురయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: