కృష్ణా జలాల విషయంలో ఏపీ తెలంగాణలో మధ్య యుద్ధం రాజుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎవరి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు రెండు రోజులుగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో జగన్ ప్రత్యేకంగా 203 జీవోను విడుదల చేయడంపై తెలంగాణలోని విపక్ష పార్టీలు ఒక్కసారిగా గళం పెంచాయి. జగన్ కేసీఆర్ ఇద్దరు మంచి మిత్రులు అని వారిద్దరికీ తెలియకుండా ఏ నిర్ణయం జరగదని కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,  మల్కాజ్ గిరి ఎంపీ మీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడు పై జగన్ జారీ చేసిన జీవో ప్రగతిభవన్ లో తయారైందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

IHG


 కేసీఆర్, జగన్ సోడా ,విస్కీ లా కలిసిపోయారని, వారిద్దరిని విడివిడిగా చూడలేము అంటూ రేవంత్ విమర్శించారు. అసలు ఇప్పుడు పోతిరెడ్డి పాడు వివాదం చెలరేగడం చూస్తుంటే టాపిక్ డైవర్షన్ కోసమే ఇద్దరు సీఎంలు ఈ విధంగా నాటకాలాడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ జగన్ ఇద్దరు మిత్రులు కాబట్టి వారిద్దరి మధ్య రాష్ట్రాలకు సంబంధించి విభేదాలు వచ్చే పరిస్థితి లేదని, అసలు ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ప్రాజెక్ట్ కట్టాలనుకున్నారని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ చిత్తూరు జిల్లాలో నగరి ఎమ్యెల్యే రోజా ఇంటికి వెళ్లిన సందర్భంగా హామీ ఇచ్చారన్నవిషయాన్ని రేవంత్ హైలెట్ చేశారు.


 ఇప్పుడు కేసీఆర్ జగన్ ఇద్దరూ కలిసే రాయలసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఉండవచ్చని, కాకపోతే తెలంగాణ సెంటిమెంట్ పెరగడానికి అవకాశం ఉండే విధంగా ఏపీ సీఎం జగన్ పోతిరెడ్డిపాడు అంశాన్ని హైలెట్ చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి కృష్ణాజలాల వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య పెద్దఎత్తున రాజకీయ దుమారం రేపుతోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: