రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. కానీ, కొంద‌రు నాయ‌కులు మాత్రం తాము ఎలా ఉం డ‌బోతోందీ ముందుగానే చెప్పి చేస్తారు. ఇది రాజ‌కీయాల్లో కొంత వైచిత్రి! ఇలాంటి నేత గురించే ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఆయ‌నే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి. ఆయ‌న ఎంపీగా ఎన్నికై.. ఏడాది పూర్త‌యింది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది లేదు. అంతెందుకు.. ఆయ‌న దాదాపుగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో కూడా ఉండ‌ర‌నే టాక్ కూడా ఉంది. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే నాధుడే క‌రువ‌య్యార‌నే వాద‌న వినిపిస్తోంది.

 

అయితే, ఈ ప‌రిస్థితికి ఎవ‌రిని త‌ప్పుబ‌ట్టాలి? అంటే.. ఇదే తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితిగా ఉంది. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట‌.. ఎన్నిక‌ల క్ర‌మంలో అనూ హ్యంగా వైసీపీలోకి చేరిపోయారు.ఈ  క్ర‌మంలో నే మీరు పార్టీ ఎందుకు మారుతున్నారు? అన్న మీడియా ప్ర‌శ్న‌కు ఆయ‌న ఇచ్చిన స‌మాధానం.. ఎంపీగా గెల‌వ‌డం కోసం అని! మ‌రి ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు కాదా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు.. అవ‌కాశం ఉన్నంత‌వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కే సేవ చేస్తాను.. అని మాగుంట అప్ప ట్లోనే బ‌దులిచ్చారు. నిజానికి ఆయ‌న అన్న ఈ వ్యాఖ్య‌ల అంత‌రార్ధం అప్ప‌ట్లో పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకో లేదు.

 

కానీ, ఇప్పుడు ఎంపీగా మాగుంట ఎన్నికై.. ఏడాది పూర్తయింది. మ‌రిఈ ఏడాది కాలంలో ఒంగోలు ప్ర‌జ‌ల‌కు కీల‌క‌మైన వెలిగొండ ప్రాజెక్టు కానీ, ర‌హ‌దారుల నిర్మాణం కానీ, దొన‌కొండ ఫ్యాక్ట‌రీలు కానీ, పారిశ్రామిక అభి వృద్ది కానీఏమైనా ఓ అంగుళ‌మైనా ముందుకు సాగాయా? అంటే.. ప్ర‌శ్నార్థ‌క‌మే. అంతేకాదు, నిజానికి ఈ ఏడాది కాలంలో కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు ఎంపీ. మిగిలిన కాలం మొత్తం కూడా త‌న వ్యాపారాలు , వ్య‌వ‌హారాల్లోనే మునిగితేలారు. దీంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా యి. త‌న వ్యాపారాలు, వ్య‌వ‌హారాల కోస‌మేనా.. రాజ‌కీయాలు అనేవారు పెరిగారు. చిత్రం ఏంటంటే.. ఆయ ‌న‌ను కాంగ్రెస్‌లోను, టీడీపీలోను కూడా విమ‌ర్శించేవారు లేక పోవ‌డం.

 

కానీ, చిన్నా చిత‌కా క‌మ్యూనిస్టులు మాత్రం అప్పుడప్పుడు విమ‌ర్శిస్తున్నారు. అయితే, ఈ విమ‌ర్శ‌లు విన్న‌వారు మాత్రం ఎంపీగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌మ‌యంలోనే ఆయ‌న అవ‌కాశం ఉన్నంత మేర‌కు చేస్తాన‌ని చెప్పార‌ని, కాబ‌ట్టి ఇప్పుడు ఆయ‌న‌ను త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. నిజ‌మే క‌దా.. ఎన్నిక‌ల్లో పోటీ చేసే నాయ‌కులు ఏం చెబుతున్నారో కూడా తెలుసుకుంటే బెట‌ర్‌! అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి మాగుంట వ్య‌వ‌హారం.. వివాదాస్ప‌దంగా మారుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: