తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించడంలో ఎప్పుడు ముందు ఉంటారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. తరచుగా ఏదో ఒక విషయంపై టిడిపి నేతలను ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తూనే ఉంటారు. తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ విమర్శించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే తాజాగా విజయసాయి రెడ్డి చంద్రబాబు తీరును మరోసారి ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో కృష్ణాజలాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఏపీ మధ్య వివాదం రాజుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విషయంలో జగన్ తీసుకొచ్చిన 203 జీవోపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
 
 
 దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఏపీ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్నాయి. కానీ ఏపీ లోని రాయలసీమకు మేలుచేసే ఈ జీవో విషయంలో టిడిపితో సహా విపక్ష పార్టీల మౌనంగా ఉండడం పై విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు. అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే చంద్రబాబుకు ఈ నెల 5న విడుదలైన జీవో మాట్లాడేందుకు మనసు రాలేదా అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అసలు మీరు రాయలసీమ బిడ్డేనా ?, మీరు ఏపీ వారేనా అని చంద్రబాబు ను ఎద్దేవా చేశారు.
 
 
 ఈ మేరకు విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వివాదం చెలరేగినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మౌనంగానే ఉంటూ వస్తోంది. ఈ విషయంలో ఏ విధంగా స్పందించాలి అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో టిడిపి ఇరకాటంలో పడినట్టుగానే కనిపిస్తోంది. దీనిపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: