కరోనా వైరస్ పై అన్ని దేశాలు తీవ్రస్థాయిలో పోరాడుతున్నాయి. కనిపించని శత్రువు కావడంతో ఆర్థికంగా మరియు ప్రాణ నష్టం తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. అయితే వైరస్ యొక్క పని చేసే విధానం ఇప్పుడు పూర్తిగా అందరికి అర్థం కావడంతో చాలా వరకు ప్రభుత్వాలు అమలు చేసిన లాక్ డౌన్ లు  ఎత్తేస్తున్నాయి. ఇంకా వైరస్ కి భయపడి ప్రజలు ఇళ్లలోనే ఉంటే ఖచ్చితంగా ఆకలి చావులు ఎక్కువ అవుతాయని ఇండియాలో కూడా లాక్ డౌన్ సడలింపు విషయాలలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ఊరట ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం దాదాపు ఓకే చెప్పడానికి రెడీ అయింది. ఇటువంటి తరుణంలో ఇప్పటికే ఇండియాలో రైల్వే వ్యవస్థను మెల్లగా పునరుద్ధరించడం జరిగింది.

 

మే 12వ తారీకు నుండి కొన్ని ప్రధాన నగరాలకు రైళ్లను కేంద్ర ప్రభుత్వం నడిపించు కోవచ్చని రైల్వేశాఖకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. అయితే మరోపక్క దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో తాజాగా రైల్వే ప్రయాణం అంటే దేశంలో ఉన్న ప్రజలు వణికిపోతున్నారు. రైలు ప్రయాణం అంటే దాదాపు రిస్కే అని వైరస్ అంటుకునే అవకాశం ఉంటుందని జనాలు భయాందోళనకు గురవుతున్నారు.

 

ఈ విధంగా రైల్వే ప్రయాణం చేసి వైరస్ అంటించుకుంటే ప్రభుత్వాలకు క్వారంటైన్ చేయడం చిన్న విషయం కాదన్నది దేశంలో ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులు అభిప్రాయం. చాలావరకు ప్రస్తుతం దేశంలో వైరస్ కేసులు ఉన్న కొద్ది బయట పడుతున్న తరుణంలో కేంద్రం రైల్వే కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల జనాలు మరియు రాజకీయ నేతలు బెంబేలెత్తుతున్నారు. మద్యం అమ్ముకోండి ఆదాయం తెచ్చుకోమని కేంద్రం పర్మిషన్ ఇవ్వగానే చంకలు గుద్దుకుని గేట్లు ఎత్తేసిన రాష్ట్రాలు ఇప్పుడు మాత్రం రైళ్లు మొదలు అవుతాయనగానే తెగ టెన్షన్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: