ప్రపంచంలో ఏది పడితే అది తినే దేశాలలో చైనా దేశం ముందు ఉంటుంది. అది కుక్క అయిన, పిల్లి అయినా, బొద్దింకలు, పురుగులు అయినా పాములు అయినా, కప్పలు అయినా మొహమాటం లేకుండా తినేస్తుంటారు చైనీయులు. అలా గబ్బిలం చైనీయులు తిన్నబట్టే ప్రపంచమంతా ముక్కు మూసుకో వలసి వచ్చిందని చాలా మంది ప్రస్తుతం కరోనా వైరస్ గురించి సెటైర్లు వేస్తుంటారు. ముఖ్యంగా ఈ వైరస్ చైనా దేశంలో వుహాన్ అనే మార్కెట్ లో బయటపడిందని ఎప్పటినుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనా దేశంలో వుహాన్‌ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం విక్రయాలు జరిగే మార్కెట్.

 

అటువంటిది కరోనా వైరస్ బయటపడిన తర్వాత వుహాన్‌ మార్కెట్ మరియు చుట్టుప్రక్కల ఉన్న నగరాలు మొత్తం చైనా దేశంలో మూసేసింది. ఎక్కడికక్కడ చైనా దేశానికి చెందిన పోలీసులు మరియు మిలటరీ అధికారుల చేత పహారా కాయించి మాంసం మరియు అన్ని షాపులు క్లోజ్ చేసేసారు. పూర్తిగా వుహాన్‌ నగరంలో చైనా దేశం కరోనా వైరస్ బయట పడిన తర్వాత లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. అయితే ఇటీవల వైరస్ మొత్తం కంట్రోల్ అవటం తో వుహాన్ స‌హా కొన్ని న‌గ‌రాల్లో మాంసం విక్ర‌యాల్ని మళ్లీ స్టార్ట్ చేశారు.

 

ఎప్పట్లాగే చైనా దేశానికి చెందిన వాళ్ళు మాంసాన్ని కొనటానికి ఎగబడుతున్నారు. ముఖ్యంగా కప్పల్ని కొనటానికి పెద్ద ఎత్తున జనాలు చుట్టూ చేరి కవర్లలో వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. కప్పల్ని తినడం అంటే మనకే అసహ్యం కలగవచ్చు కానీ వారికి  బ‌తికున్న క‌ప్ప‌ల్ని అలాగే నూనెలోకి వేసి బ‌య‌టికి తీసి లాగించేస్తారు. మ‌నం లైవ్ ఫిష్ కోసం ఎలా ఆస‌క్తి చూపిస్తామో వాళ్లు లైవ్ క‌ప్ప‌లు అలా అన్న‌మాట‌. తాజాగా లాక్ డౌన్ చైనా లో ఎత్తేసిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: