ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న మొన్నటి దాకా కరోనా వైరస్ పనుల విషయంలో దృష్టి పెట్టడం జరిగింది. అయితే తాజాగా పరిపాలన పై సరికొత్త నిర్ణయాలతో దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల్లో పాలన విషయంలో తన టీం కొనసాగేలా జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఓవైపు మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు వినిపిస్తుండగా మరోపక్క అధికార యంత్రాంగం విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా రాజధాని తరలింపు ఇక అనేక విషయాలు ప్రథమంగా ముందుండగా ఈ సమయంలో ముఖ్యమైన అధికారుల మార్పు అనవసరమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని కి లైన్ క్లియర్ చేశారు.

 

ప్రస్తుతం రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉన్న నీలం సాహ్ని అనూహ్యంగా బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ కాలం పాటు జగన్ తో సన్నిహితంగా మెలిగిన ఎల్ వి సుబ్రహ్మణ్యం స్థానంలో ఆమె బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కాగా ఈ జూన్ నెలలో ఆమె పదవీ కాలం పూర్తి కానుంది. జూన్ 30వ తారీఖున ఆమె రిటైర్డ్ కావలసి ఉంది. దాంతో ఆమె స్థానంలో కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరిని నియమిస్తారు అనేది ఊహాగానాలు మొదలయ్యాయి. వివిధ వర్గాల్లో చర్చ కూడా సాగింది. అయితే ఇటువంటి సమయంలో ఏమాత్రం నీలం సాహ్ని పదవి కోల్పోకుండా ఆమె పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రానికి జగన్ సర్కార్ లెటర్ పంపినట్లు సమాచారం.

 

లెటర్ కేంద్రం ఆమోదిస్తే ఆమె పదవీకాలం మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉండబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నీలం సాహ్ని తో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వానికి చాలా విలువైన సలహాలు ఇస్తూ రాణిస్తున్న తరుణంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు...కీలకమైన ఈ టైంలో ఈ టీం తనతోనే పనిచేసే విధంగా జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: