ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అధికార పార్టీ వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా వరకు ఈ ఎమ్మెల్యేలు అంతా ఇటీవల కరోనా వైరస్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.  పార్టీలో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు తప్పించి మిగతా ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి ప్రజలను ఆదుకుంటూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా వరకు ప్రజలకు నిత్యావసర వస్తువులు నుంచి మాస్క్ ల వరకూ పంపిణీ చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ సహాయ కార్యక్రమాలు చాలా వరకూ తమ సొంత ఖర్చుతో ఎమ్మెల్యేలు చేపట్టడం జరిగింది. మరి కొంతమంది సొంత చారిటబుల్ ట్రస్ట్ ల ద్వారా ప్రజలకు సహాయం చేశారు. అయితే చాలా వరకూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో పూర్తి గ్రిప్ లో ప్రజలు తమ గుప్పెట్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేసినట్లు టాక్.

 

సహాయం చేసిన వైసిపి ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యుల పేరిట సొంత ఛారిటబుల్ ట్రస్ట్ ల ద్వారా సహాయం చేస్తున్న ఎవరిని తప్పు పట్టే పని లేదు. ఎక్కువగా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని బి ఫామ్ లే లక్ష్యంగా వైసిపి నాయకులు పని చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్రంగా గెలిచే ఛాన్స్ కంటే ఎక్కువగా పార్టీ గుర్తులపై గెలిచే అవకాశాలు ఎక్కువ.

 

దాదాపు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు పార్టీ పరంగానే నడుస్తాయి. అందుకే ప్రధాన పార్టీల్లో బీఫాం కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. టిక్కెట్ దక్కిందంటే సగం గెలిచినిట్లే. ఇందుకోసం ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికలకు ముందే కర్చీఫ్ తమ నియోజకవర్గంలో వేసుకోవడానికి కరోనా వైరస్ రూపంలో సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: