కరోనా వైరస్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోకూడదని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇన్చార్జిగా నియమించిన మంత్రులకు జగన్ సూచించినట్లు సమాచారం. ఏ మాత్రం రిజల్ట్ రివర్స్ అయితే మీరు రాజీనామాతో రాజ్ భవన్ కి వెళ్లాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారట. ఎప్పుడైతే రాష్ట్రంలో కరోనా వైరస్ కంట్రోల్ అవుతుందో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే వైసీపీ నేతలకు పరోక్షంగా సంకేతాలు పంపించడం జరిగింది. ఇదే సమయంలో ఆర్థికంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా గాని ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా జగన్ కంటిన్యూ చేస్తున్నారు.

 

మరోపక్క ఇటువంటి సమయంలో టిడిపి పుంజుకుంది అంటే చాలా వరకు ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుందని జగన్ ప్రస్తుతం కంగారుపడుతున్నారట. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఇన్చార్జి ఉన్న మంత్రులకు గట్టిగా ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పై ఒత్తిడి పెరిగింది. ఎవరైతే పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారో వారందరినీ ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళ్ళమని వారితోనే ఉండాలని ఇంచార్జి మంత్రులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఇదే సమయంలో కరోనా వైరస్ విపత్కర టైములో ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని కూడా వారి చేతనే ప్రజలకు ఇప్పిస్తున్నారు.

 

అభ్యర్థులు సైతం ఉచితంగా తమ సొంత డబ్బులతో నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఇలా అనేక చోట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును ఇప్పటి నుంచే సాయం రూపంలో పెట్టేస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సయితం కరోనా సాయం పేరుతో నిత్యం ప్రజల వద్దనే ఉంటూ రాబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ప్రచారం చేసే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో ఉంటుందో లేదో తెలియని నేపథ్యంలో ప్రజెంట్ సమయాన్ని వైసీపీ నేతలు చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: