సాధారణంగా చిన్నపిల్లలకు డబ్బులు ఇస్తే.. ఏదైనా చాక్లెట్, బిస్కె మరేదైనా కొంటారు.  కొన్ని సార్లు డబ్బులు ఇవ్వమని కుంటుంబ సభ్యులను మారాం చేస్తూ అడుగుతుంటారు.  చిన్న వయసులు చేసే అల్లరి పెద్దవాళ్లకు కూడా ముద్దు వస్తుంది.  అందుకే చిన్ననాటి గుర్తులు జ్ఞాపకం చేసుకుంటే.. అయ్యే ఆ వయసు మళ్లీ వస్తే బాగున్ను అనుకుంటారు.  అయితే కొంత మంది చిన్నారులు మాత్రం చిన్ననాడే గొప్ప గొప్ప పనులు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంటారు.  వారి సృజనాత్మకత ఎంతో గొప్పగా ఉంటుంది.. పెద్దవాళ్లను అబ్బురపరిచే విధంగా ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఎంతో మంది నిరుపేదలు ఆకలితో బాధపడుతున్నారు. చేద్దామంటే పనిలేదు.. ఖాళీగా కూర్చుంటే తిండిలేదు.. ఇలా ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు.

 

అలాంటి వారి కోసం స్వచ్చంద సంస్థలు, సినీ సెలబ్రెటీలు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు.  అన్నార్తులను ఆదుకుంటూ తమ వంతు కృషి చేస్తున్నారు.  ఈ సమయంలో కొంత మంది విద్యార్థులు కూడా తాము దాచుకున్నది విరాళంగా ఇస్తున్నారు.  తాజాగా 3 ఏండ్ల వ‌య‌సులోనే చెఫ్‌గా మారి క‌ప్‌కేక్స్‌ త‌యారు చేసేశాడు. ఇవి కుటుంబ స‌భ్య‌లుకు అనుకుంటే పొర‌పాటే.. తాను చేసిన కేకులు విక్రయించి  50 వేలు డబ్బు సంపాదించాడు.

 

అంత చిన్న కుర్రాడు ఇలా డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏంటా అనుకుంటున్నారా? ఇక్కడే ట్విస్ట్.  వ‌చ్చిన‌డ‌బ్బంతా త‌ల్లిదండ్రులు క‌రిష్మా, కేశ‌వ్‌ల‌తో క‌లిసి ముంభై ఫౌండేష‌న్ నిధులకు విరాళంగా ఇచ్చాడు. ఈ చిన్నారి  పేరు క‌బీర్‌. చిన్న పిల్లవాడి కృషిని ప్రశంసించడానికి ముంబై పోలీసులు సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకున్నారు. ఈ వ‌య‌సులో ఇలాంటి ఐడియా రావ‌డం గ‌మ‌నార్హం అని పొగ‌డ్త‌ల‌తో క‌బీర్‌ను ముంచేశాడు ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌. కరోనా బాధితులను ఆదుకునేందుకు అందరూ పెద్ద మనసు చేసుకోవాలని అన్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: