ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి భూముల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు హయాంలో రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. అయితే మొదటి నుండి ఈ రాజధాని భూముల వ్యవహారంలో చంద్రబాబు సర్కారు అవకతవకలకు పాల్పడిందని జగన్ పార్టీ ఆరోపిస్తోంది. ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అమరావతి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుని నాలుగు వేల ఎకరాల్లో టిడిపి చట్టాలను బేఖాతరు చేస్తూ నిబంధనలను ఉల్లంఘించిన విధానాన్ని గుర్తించినట్లు టాక్. దాదాపు నాలుగు వేల ఎకరాల్లో ఇష్టానుసారంగా టిడిపి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం కూడా ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

 

ఈ నివేదిక ఆధారంగా కీలక నిర్ణయం జగన్ సర్కార్ తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్ భూములను సాగుచేసుకుంటున్న నిరుపేద దళిత రైతుల దగ్గర నుండి అక్రమంగా భయపెట్టి భూములను అతి తక్కువ ధరకు కొన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు భారీగా లబ్ధి పొందినట్లు ఏపీ ప్రభుత్వం ముందు నుండి అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనిలో భాగంగానే సీబీఐ దర్యాప్తుకు ఈ వ్యవహారాన్ని అప్పగించడానికి రెడీ అవుతోంది.

 

ముఖ్యంగా భూములు కొనుగోలు చేసిన లబ్ధిదారులు మరియు అమ్మిన లబ్ధిదారులు రేషన్ కార్డుల విషయంలో కీలక ఆధారం దొరికినట్లు ఆ పాయింట్ తో సిబిఐకి జగన్ సర్కార్ ఈ కేసును అప్పగించనున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మొన్నటివరకు కరోనా వైరస్ న్యూస్ వల్ల ఈ అంశం పక్కకు వెళ్లగా తాజాగా మళ్లీ తెరపైకి రావడంతో ఈ విషయంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.  పైగా చంద్రబాబు మరియు నారా లోకేష్ హైదరాబాదులో ఉండటంతో రాష్ట్రంలో ఉన్న టిడిపి నాయకులలో భయాందోళన నెలకొన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: